AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fengal Cyclone Alert: దూసుకొస్తున్న భారీ తుపాను.. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన సర్కార్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తుపానుగా మరనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణాదిలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది..

Fengal Cyclone Alert: దూసుకొస్తున్న భారీ తుపాను.. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన సర్కార్
Fengal Cyclone
Srilakshmi C
|

Updated on: Nov 27, 2024 | 10:04 AM

Share

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దీంతో మరో సైక్లోనిక్ ఫెంగల్ తుఫాను దేశాన్ని తాకబోతోంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తా రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతవారణ కేంద్రం ప్రకటించింది. ఈదురు గాలులతో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఈ రోజు తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో పాటు చలి కూడా పెరగవచ్చని వెదర్ రిపోర్ట్ తెలిపింది.

ఏయే ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయంటే..

ఫెంగల్‌ తుపాను నేపథ్యంలో నవంబర్ 27, 28 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని 4వ బెటాలియన్‌కు చెందిన 7 బృందాలు తీరప్రాంతాల్లో మోహరించాయి. కారైకాల్, తంజావూరు, తిరువారూరు, కడలూరు, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. అయితే ఆ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచే చెన్నైతోపాటు దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లు మొత్తం జలమయంగా మారాయి. దీంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తుపాను ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో నవంబర్ 27 నుంచి 29 వరకు చెన్నైలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 27 నుంచి 30 వరకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుతో సహా పలు జిల్లాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా చెన్నై, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్‌తో సహా 9 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని పలు ప్రాంతాలలో ఈ రోజు (నవంబర్ 27) ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా తమిళనాడులో నవంబర్ 28న కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.