Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చొక్కాలు చించుకుని.. రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు.. ! వీడియో

రోడ్డుపై పడి ఇద్దరు వ్యాపారులు పిచ్చకొట్టుకుడు కొట్టుకున్నారు. పిడి గుద్దులు గుద్దుకుంటూ.. చొక్కాలు చింపుకుంటూ.. రోడ్డుపై దొర్లుతూ ఫైట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

Viral Video: చొక్కాలు చించుకుని.. రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు.. ! వీడియో
Shopkeepers Fight Video
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 26, 2024 | 11:03 AM

లక్నో, నవంబర్‌ 26: ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. షాపు బయట వస్తువులు ఉంచడంపై ఇద్దరు వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. అదికాస్తా చిరిగి చిరిగా గాలివానగా మారింది. దీంతో ఇద్దరు వ్యాపారులు రద్దీ రోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఒకరినొకరు పిడి గుద్దులు గుద్దుకుంటూ చొక్కాలు చించుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఔరయ్యా సదర్ కొత్వాలి ప్రాంతంలోని భోలే మందిర్ సమీపంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయాలోని భోలే మందిర్ సమీపంలో ఒక షాపు బయట వస్తువులు ఉంచడంపై అనిల్‌ కుమార్‌ను పక్కషాపులకు చెందిన వ్యాపారులు పవన్ కుమార్, సన్నీ, లక్కీ నిలదీశారు. దీంతో వాగ్వాదం రాజుకుంది. వివాదం ముదరడంతో భౌతిక దాడికి యత్నించారు. దీంతో ఇరు వర్గాలవారు కర్రలతో కొట్టుకున్నాడు. అనంతరం చొక్కాలు చించుకోవడంతోపాటు చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించుకున్నారు. రోడ్డుపై దొర్లుతో సినిమా టైప్‌లో ఫైట్‌ చేసుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన వీరిని స్థానికులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.

ఇవి కూడా చదవండి

అనంతరం అనిల్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పవన్ కుమార్, సన్నీ, లక్కీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లక్కీ అనే యువకుడు మైనర్‌ కావడంతో జువైనల్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మిశ్రా చెప్పారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 2021లోనూ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో చిరు వ్యాపారుల మధ్య ఇదే రీతిలో భీకర ఫైట్‌ జరిగింది. ఈ ఘటనలో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
భారీగా బయటపడ్డ బంగారం నిల్వలు.. పసిడి ధరలు సగానికి తగ్గనున్నాయా?
భారీగా బయటపడ్డ బంగారం నిల్వలు.. పసిడి ధరలు సగానికి తగ్గనున్నాయా?
IPL 2025: 90 రోజుల ఉచితం జియో హాట్‌స్టార్ ప్లాన్ గడువు పొడిగింపు!
IPL 2025: 90 రోజుల ఉచితం జియో హాట్‌స్టార్ ప్లాన్ గడువు పొడిగింపు!
అపరిచితుడిని ముద్దుపెట్టుకుంటున్నట్టు కల కంటున్నారా అర్ధం ఏమిటంటే
అపరిచితుడిని ముద్దుపెట్టుకుంటున్నట్టు కల కంటున్నారా అర్ధం ఏమిటంటే
రన్యా రావుకు ఊహించని షాకిచ్చిన భర్త!
రన్యా రావుకు ఊహించని షాకిచ్చిన భర్త!
నిర్మాతగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన నిహారిక కొణిదెల
నిర్మాతగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన నిహారిక కొణిదెల
Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట...
Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట...
లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ