Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం.. అలసిపోయి ఆఫీస్‌లో కాసేపు కునుకు తీసిన ఉద్యోగి! కట్‌చేస్తే.. దెబ్బకు జాబ్‌ ఊస్టింగ్‌

మనిషన్నాక అలసి పోవడం మామూలే.. యంత్రంలా అదే పనిగా వర్క్ చేయలేడుగా.. దాదాపు 20 యేళ్లు ఎంతో నమ్మకంగా ఉద్యోగం చేసి కంపెనీ నమ్మకాన్ని చూరగొన్న ఓ ఉద్యోగి.. ఆ రోజు బాగా అలసి పోయాడు. కాసేపు అలా కునుకు తీశాడు. అంతే దెబ్బకు అతని ఉద్యోగం పీకేసి ఇంటికి పంపింది కంపెనీ యాజమన్యం.. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందంటే

పాపం.. అలసిపోయి ఆఫీస్‌లో కాసేపు కునుకు తీసిన ఉద్యోగి! కట్‌చేస్తే.. దెబ్బకు జాబ్‌ ఊస్టింగ్‌
Man Fired For Napping After Working Place
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 25, 2024 | 12:58 PM

ఆఫీస్‌లో వర్క్‌ అధికంగా ఉంటడం వల్ల పాపం అలసిపోయాడో ఉద్యోగి. దీంతో కాసేపు అలా టేబుల్‌పై పడి కునుకు తీశాడు. అంతే బాస్‌గాడు చూసేశాడు.. వెంటనే సదరు ఉద్యోగిని కొలువు నుంచి పీకేశాడు. దీంతో రోడ్డుపై పడ్డ సదరు ఉద్యోగి కోర్టు కెక్కాడు. తన కంపెనీ యజమానిపై భారీ మొత్తంలో దావా వేశాడు. ఈ దారుణ ఘటన చైనాలో వెలుగు చూసింది. దీనిపై అనుకూలంగా స్పందించిన కోర్టు సదరు వ్యక్తికి రూ.41.6 లక్షలు పరిహారంగా చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన చైనా జియాంగ్షు ప్రావిన్స్‌లోని టైజింగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైక్సింగ్‌లోని ఒక రసాయన కంపెనీలో జాంగ్ అనే వ్యక్తి 20 సంవత్సరాలకు పైగా డిపార్ట్‌మెంట్ మేనేజర్‌గా ఎంతో నమ్మకంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సంవత్సరం మొదట్లో అతడిని ఉద్యోగం నుంచి కంపెనీ తొలగింపు జరిగింది. సీసీటీవీ నిఘా ఫుటేజీలో అతను తన డెస్క్‌పై పడుకుని నిద్రపోతున్నట్లు యాజమన్యం గుర్తించింది. ఈ సంఘటన జరిగిన రెండు వారాల తర్వాత సదరు కంపెనీ HR విభాగం ఒక నివేదికను విడుదల చేసింది. అందులో జాంగ్ అలసట కారణంగా పని వేళల్లో నిద్రపోతూ పట్టుబడ్డాడని, ఆ రోజు సుమారు ఒక గంటకుపైగా నిద్రపోయినట్లు రుజువైంది. దీంతో కార్మిక సంఘంతో సంప్రదించిన తర్వాత, కంపెనీ అధికారిక తొలగింపు నోటీసును జాన్‌కు జారీ చేసింది. జాంగ్ ప్రవర్తన కంపెనీ కఠినమైన జీరో-టాలరెన్స్ డిసిప్లిన్ విధానాన్ని ఉల్లంఘించినట్లు అందులో కంపెనీ యాజమన్యం పేర్కొన్నారు.

జాన్‌ 2004లో కంపెనీలో చేరాడు. అతడు ఓపెన్-ఎండ్ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్‌పై సంతకం చేశాడు. అయితే, ఉద్యోగ సమయలో నిద్రిస్తున్న మీ ప్రవర్తన.. కంపెనీ జీరో-టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీని తీవ్రంగా ఉల్లంఘించింది. తత్ఫలితంగా యూనియన్ ఆమోదంతో కంపెనీ మీ ఉద్యోగాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి మీకు – కంపెనీకి మధ్య ఉన్న అన్ని కార్మిక సంబంధాలను ముగించినట్లు కంపెనీ నుంచి వచ్చిన నోటీసులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే జాంగ్ మాత్రం తనని అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగిచారని కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కంపెనీపై కోర్టులో దావా వేశాడు. కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగంలో నిద్రపోవడం మొదటిసారి నేరం. దాని వల్ల కంపెనీకి ఎలాంటి తీవ్రమైన హాని కలిగించలేదని టైక్సింగ్ పీపుల్స్ కోర్టు న్యాయమూర్తి జు క్వి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. జాంగ్ ఆ కంపెనీలో 20 యేళ్లు అత్యుత్తమ సేవ చేశాడు. అతని ప్రతిభ ఆధారంగా కంపెనీ ఇచ్చిన ప్రమోషన్లు, జీతాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఒక్కసారి నిబంధనలు ఉల్లంఘించినంత మాత్రాన ఉద్యోగం నుంచి తొలగించడం అసమంజసమని నిర్ధారించింది. జాంగ్‌కు నష్ట పరిహారంగా వెంటనే రూ. 41.6 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.