AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Kissik Song: ‘దెబ్బలు పడతాయ్‌ రో.. దెబదెబ్బలు పడతాయ్‌ రో.. కిస్ కిస్ కిస్సిక్‌’ పుష్ప 2 ఐటెం సాంగ్‌ విన్నారా?

ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ పాట వచ్చేసింది. చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ సాంగ్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇందులో శ్రీలీల డ్యాన్స్ పర్ఫామెన్స్ కు సంబంధించిన స్టిల్స్, సాంగ్ లిరిక్స్ మేకర్స్ విడుదల చేశారు..

Pushpa 2 Kissik Song: 'దెబ్బలు పడతాయ్‌ రో.. దెబదెబ్బలు పడతాయ్‌ రో.. కిస్ కిస్ కిస్సిక్‌' పుష్ప 2 ఐటెం సాంగ్‌ విన్నారా?
Pushpa 2 Kissik Song
Srilakshmi C
|

Updated on: Nov 24, 2024 | 9:02 PM

Share

‘ పుష్ప అంటే.. ఫ్లవరు అనుకుంటివా? వైల్డ్‌ఫైరు. తగ్గేదేలే..’ వంటి మాస్‌ డైలాగులతో సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన పుష్ప సినీ ప్రియులను అల్లాడించేసింది. ఈ మువీలోని డైలాగులు, పాటలు, సన్నివేశాలు ఎంతగా పాపులర్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఇందులో స్పెషల్ సాంగ్‌ చేసిన సమంత పర్ఫామెన్స్‌ మైండ్ బ్లోయింగ్‌ అనే చెప్పాలి. ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావ’ సాంగ్‌ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. పూష్ప ది రైజ్‌ వచ్చి మూడేళ్లు గడిచినా ఇందులోని డైలాగ్‌లు, పాటలు ఇప్పటికీ ఏదో ఒకమూల వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక ఇప్పుడు పుష్ప 2 మువీ కోసం యావత్‌ దేశంతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ మువీ డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, గ్లింప్స్‌, ట్రైల‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచేశాయి. ఆదివారం చెన్నైలో వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ జరిగింది. చెన్నైలోని లియో ముత్తు స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి నేషనల్ క్రష్ రష్మిక, ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్ హీరోయిన్‌ శ్రీలీల సందడి చేశారు.

ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ‘పుష్ప 2’ లోనూ ‘కిస్సిక్‌’ అనే స్పెషల్‌ సాంగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల నటించింది. అయితే అందులో శ్రీలీల పర్ఫామెన్స్‌ ఎలా ఉందనే దానిపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని ఎదురుచూసిన ఆ పాట లిరికల్‌ వీడియో ఎట్టకేలకు వచ్చేసింది. పుష్ప 2 మువీలోని ఈ స్పెషల్ సాంగ్‌ను శ్రీలీల కౌంట్‌డౌన్‌ లెక్కపెట్టి స్వయంగా లాంచ్‌ చేసింది. ‘దెబ్బలు పడితాయ్‌ రో.. కిస్సిక్‌’ అంటూ సాగే ఈ సాంగులో పుష్పగాడు, శ్రీలీల కెమెస్ట్రీ బాగానే వర్కౌట్‌ అయ్యింది. మాటలతో ఊరించడం ఎందుకు మీరూ ఈ సాంగ్‌ లిరిక్స్‌ వినేయండి.. అయితే ప్రత్యేక సాంగ్ లో శ్రీలీల పర్ఫామెన్స్ సమంతను బీట్ చేసిందా? లేదా? అనేది మువీ చూశాకే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే..

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.