Pushpa 2: అల్లు అర్జున్, శ్రీలీల కిస్సిక్ సాంగ్.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 దిరూల్. సుమారు మూడేళ్ల క్రితం రిలీజైన పుష్ఫ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpa 2: అల్లు అర్జున్, శ్రీలీల కిస్సిక్ సాంగ్.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
Pushpa 2 Kissik Song
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2024 | 9:16 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ఫ 2.. ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సమయం తీసుకుని మరీ సుకుమార్ రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ మూవీలో విలన గా నటించనున్నాడు. సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే బిహార్ రాజధాని పట్నాలో ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఆదివారం (నవంబర్ 25) చెన్నైలో పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ తో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేదికపైనే పుష్ఫ 2 సినిమాలోని స్ఫెషల్ సాంగ్ కిస్సిక్ పాటను రిలీజ్ చేయనున్నాడు అల్లు అర్జున్ .ఈ పాటలో అల్లు అర్జున్ సరసన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల డ్యాన్స్ చేయడం విశేషం. ఈ సాంగ్ కు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ , ప్రోమోలు ఆసక్తిని పెంచేశాయి. దీంతో కిస్సిక్ సాంగ్ ఎలా ఉండనుందోనని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

కిస్సిక్ సాంగ్ పుష్ఫ 2 సినిమాకు హైలైట్ గా నిలవనుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. మరి రిలీజ్ కు ముందే ఇంత సెన్సేషన్ సృష్టించిన ఈ పాటను ఎవరు పాడారన్న విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ‘కిసిక్’ సాంగ్‌ని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సింగర్ సుభాషిణి పాడగా.. హిందీలో సుభాషిణి, లోతిక ఝా.. మలయాళంలో ప్రియా జెర్సన్.. బెంగాలీలో ఉజ్జయినీ ముఖర్జీ ఆలపించారు. చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో వీరందరూ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సింగర్స్ వీరే..

పుష్ఫ 2 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. పుష్ఫ 1 లో సమంత ఊ అంటావా సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో పుష్ప 2 లో కిసిక్ సాంగ్ అంతకు మించి ఉంటుందంటున్నాడు డీఎస్పీ. మరికాసేపట్లో ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.