Viral: నీది కూడా తప్పుందిలే బాసూ.. ఆఫీసుకు అవి ఆర్డర్ పెట్టాలా..?

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన రెడ్డిట్‌లో, యూజర్స్ తమ జీవితంతో విభిన్నమైన సందర్భాల గురించి ఆసక్తికరమైన కథనాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆఫీసుకు కండోమ్స్ ఆర్డర్ చేయగా.. బఫూన్ అయ్యానంటూ తన బాదను వెళ్లగక్కాడు.

Viral: నీది కూడా తప్పుందిలే బాసూ.. ఆఫీసుకు అవి ఆర్డర్ పెట్టాలా..?
Condoms
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2024 | 11:52 AM

ఇప్పుడు ఏ వస్తువు కావాలన్నా.. ఏ ఫుడ్ కావాలన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే చాలు నిమిషాల్లో డెలివరీ వచ్చేస్తుంది. ఆయా సంస్థలు అంత ఫాస్ట్‌గా సర్వీస్ అందిస్తున్నాయి. అయితే ఏది ఆర్డర్ చేసినా.. వారు నీట్‌గా ప్యాక్ చేసి డెలివరీ చేయడం వారి బాధ్యత. అయితే ఓ వ్యక్తి.. ఆన్‌లోన్‌లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి కండోమ్స్ ఆర్డర్ పెట్టి.. ఇబ్బందులకు గురయ్యాడు. ఆ వ్యక్తి డెలివరీ అడ్రస్.. ఆఫీసుకు పెట్టడంతో.. అసలు చిక్కు వచ్చి పడింది.  కండోమ్‌ను ఎవరికి కనిపించకుండా నీట్‌గా ప్యాక్ చేసి ఇస్తారనుకున్నాడు సదరు కస్టమర్. అయితే దాని ప్యాకింగ్ చూసిన తర్వాత ఈ ఆర్డర్ ఎందుకు పెట్టానా అని తల పట్టుకున్నాడు. ఈ ఇబ్బందికరమైన కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పంచుకున్నాడు ఆ వ్యక్తి. ఆ స్క్రీన్‌షాట్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి… ప్రతిసారీ బ్లింకిట్ నుండి కండోమ్‌లను ఆర్డర్ చేసేవాడు. డెలివరీ అడ్రస్‌ ఆఫీసుకు పెట్టేవాడు. అన్నిసార్లు కూడా డెలివరీ కంపెనీ ఆర్డర్‌లను నీట్‌గా ప్యాక్ చేసి పంపేవి. ఈ సారి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి కండోమ్‌లను ఆర్డర్ పెట్టాడు సదరు వ్యక్తి. వాటిని తీసుకుని వచ్చిన డెలివరీ బాయ్‌ కాల్ చేయగా.. ఆఫీసు రిసెప్షన్ డెస్క్ వద్ద ఇవ్వమని చెప్పాడు సదరు కస్టమర్. సాయంత్రం పని ముగించుకుని ఆర్డర్ ప్యాక్ తీసుకోడానికి రిసెప్షన్ డెస్క్‌కి వెళ్లినప్పుడు, ఆ వ్యక్తి పింక్ కవరులో బయటకు కనిపించేలా ప్యాక్ చేసిన కండోమ్‌లను చూసి షాక్ అయ్యాడు. ఆఫీసులో తన గురించి బ్యాడ్‌గా అనుకుంటారేమో అని తెగ మదనపడుతున్నాడు.

అయితే కొందరు ఆర్డర్ చేసిన వ్యక్తినే తప్పుబడుతున్నారు. వర్క్‌ప్లేస్‌లో కండోమ్‌లను ఆర్డర్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..