AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి బాబోయ్.. పెళ్లి కొడుకు మెడ నుంచి అది మాయం చేసిన దొంగ.. ఆ తర్వాత..!

వరుడు గుర్రపు స్వారీ చేసుకుంటూ కుటుంబ సమేతంగా గుడికి వెళ్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి పెళ్లికొడుకు దగ్గరకు వచ్చాడు.

ఓరి బాబోయ్.. పెళ్లి కొడుకు మెడ నుంచి అది మాయం చేసిన దొంగ.. ఆ తర్వాత..!
Groom Chasing
Ashok Bheemanapalli
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 26, 2024 | 9:48 AM

Share

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లోని దంగర్వాలీలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నవంబర్ 23న ఆ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో సినీ హీరోలా తన దండలోంచి కరెన్సీ నోట్లను దొంగిలించిన యువకుడిని వరుడు వెంబడించి పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం వరుడు గుర్రపు స్వారీ చేసి కుటుంబ సమేతంగా గుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంతలో వెనుక నుంచి ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి పెళ్లికొడుకు మెడలోని నోట్ల దండలో నుంచి ఒకనోటు తీసుకుని పారిపోయాడు. దీంతో షాకైన వరుడు.. వెంటనే పెళ్లి వేడుకను వదిలి పారిపోతున్న యువకుడిని వెంటాడాడు. సినీ పక్కీలో ఛేజ్ చేశాడు.

ఆ నోట్ల దండలో నుంచి తీసుకున్న ఒక్క నోటుతో పారిపోయిన యువకుడు సమీపంలో పార్క్ చేసిన టాటా మ్యాజిక్ లోడర్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేసి బయల్దేరాడు. కానీ వరుడు వదల్లేదు. వాహనం డోర్‌కు వేలాడుతూ, వాహనాన్ని ఆపమని పదేపదే కోరారు. అపకపోవడంతో డోర్‌లో నుంచి వాహనంలోకి దూకి దొంగను పట్టుకున్నాడు. ఇంతలో వరుడి కుటుంబీకులు కూడా అక్కడికి చేరుకుని వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు.

వాహనం ఆపిన తర్వాత పెళ్లికొడుకు, అతని కుటుంబ సభ్యులు దొంగను పట్టుకున్నారు. ఆగ్రహంతో యువకుడిని, డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఒక్క నోటు కోసం ఇంత పెద్ద గొడవ జరుగుతుందని తనకు తెలియదని ఆ యువకుడు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత వరుడి కుటుంబీకులు అతడిని క్షమించి వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన అక్కడున్నవారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడి ధైర్యసాహసాలు, జనాల నవ్వు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన పెళ్లికొడుకు ధైర్యసాహసాలను చాటిచెప్పడం చర్చనీయాంశంగా మారింది. దంగర్వాలీలో జరిగిన ఈ సంఘటన జనానికి వినోదాన్ని పంచింది. అయితే అదే సమయంలో చిన్న చర్యలు కొన్నిసార్లు పెద్ద దుమారాన్ని సృష్టిస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..