Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఎరుపెక్కిన రోడ్లు.. ఏరులై పారిన ఎర్రని ద్రవం! భయంతో జనం గజగజ

హైదరాబాద్‌లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి రోడ్లపై ఎర్రటి ద్రావణం ఏరులై పారింది. భయంకరమైన దుర్వాసనతో రోడ్లపై పారుతున్న ఈ నీటిని చూసి స్థానికులు భయంతో గజగజ వణికిపోయారు..

Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఎరుపెక్కిన రోడ్లు.. ఏరులై పారిన ఎర్రని ద్రవం! భయంతో జనం గజగజ
Chemical Waste Spills On Roads
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 26, 2024 | 12:00 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 26: హైదరాబాద్‌ రోడ్లపై ఒక్కసారిగా ఎర్రటి రక్తం మాదిరి రంగు ద్రవం ఒక్కసారిగా వరదలా పారింది. అక్కడ ఏ హత్యా జరగలేదు. ఎవరికీ ఏ గాయాలు కాలేదు. కానీ చూసేందుకు అచ్చం రక్తం మాదిరే ఉన్న ఎర్రని ఎరుపురంగు కలిగిన చిక్కని ద్రవం రోడ్లపై ఏరులై పారుతుంటే స్థానికులు బెంబేలెత్తిపోయారు. చివరికి అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది.

హైదరాబాద్‌ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్, వెంకటాద్రినగర్ వంటి కొన్ని కాలనీల్లో సోమవారం రాత్రి ఒక్కసారిగా ఎరుపురంగులో ఉన్న చిక్కని మురుగు నీరు మ్యాన్‌హోళ్ల నుంచి ఉబికివచ్చింది. భరించలేనంత దుర్గంధంతో రోడ్లపై నీరు పారడంతో స్థానికులు ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘాటైన రసాయనాలు కలిసిన దుర్గంధం ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. వయోధిక వృద్ధులు ఊపిరి పీల్చుకోవడంలో సతమతపడ్డారు. దీంతో తీవ్రమైన దగ్గు, కళ్లు ఎరుపెక్కి మంట రావడం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ రోడ్లపై ప్రయాణించడానికి వాహనదారులు సైతం వెనుకాడారు.

దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఉండే కొన్ని గోడౌన్లల్లో పెద్దఎత్తున కెమికల్స్‌ను నిల్వ చేస్తుందటం వల్ల.. అక్కడి చిన్నచిన్న యూనిట్ల నుంచి రసాయనిక వ్యర్థాలు నేరుగా డ్రైనేజీలోకి వదులుతున్నారు. జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామికవాడల్లో వందల సంఖ్యలో భారీ, చిన్న తరహా పరిశ్రమలు దశాబ్దాల కాలం నుంచీ కొనసాగుతున్నాయి. వాటిల్లో చాలావరకు ఫార్మాసూటికల్స్‌ రంగానికి సంబందించినవే. వీటివల్లనే ఈ పరిస్థితి తలెత్తినట్లు గుర్తించారు. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బల్దియా అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్