Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘నువ్వులేని లోకంలో నేనుండలేను..’ భార్య మృతిని తట్టుకోలేక కాసేపటికే భర్త కూడా.. !

పెళ్లినాటి బాసలు అతను యాదిలోనే పెట్టుకున్నాడు. చివరి ఊపిరి వరకు ఆమెను కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నాడు. కానీ విధి అంతలోనే ఆమెను అతని నుంచి వేరుచేసింది. కానీ ఆమెపై ఉన్న మమకారం అతన్ని వీడలేదు. అంతే.. కాసేపటికే అతని గుండె కూడా కొట్టుకోవడం మానేసింది. అలా ఆ ఇంట ఒకేసారి ఆలుమగలు ఊపిరివదిలడం ఊరందరినీ కంటతడి పెట్టించింది..

Telangana: 'నువ్వులేని లోకంలో నేనుండలేను..' భార్య మృతిని తట్టుకోలేక కాసేపటికే భర్త కూడా.. !
Kommu Veeraiah And Yellamma Couple
Follow us
M Revan Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Nov 26, 2024 | 11:30 AM

సూర్యాపేట, నవంబర్‌ 26: భార్యాభర్తల బంధం శాశ్వతం. ఇద్దరూ ఒకరికోసం ఒకరు బతకడమే జీవితం. మూడు ముళ్ళు, ఏడు అడుగులు వేసి కష్ట సుఖాల్లో తోడుంటానని పెళ్లి నాడు ఇచ్చిన మాట నిజం చేశాడు ఓ వృద్ధుడు. 60 ఏళ్లు అన్యోన్య సంసార జీవితం గడిపారు. కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. అనారోగ్యంతో భార్య మృతి చెందిన గంటల వ్యవధిలో ‘నువ్వులేని లోకంలో నేనూ ఉండను’ అంటూ బెంగతో భర్త కూడా కన్ను మూశాడు. మూడుముళ్లు, ఏడడుగులతో ఏర్పడిన ఆ బంధం కాటికి చేరే వరకూ అలాగే సాగింది.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కొమ్ము వీరయ్య (75), కొమ్ము ఎల్లమ్మ (70) దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొద్దిపాటి వ్యవసాయ భూమితో పిల్లలను పెంచి, పెద్ద చేసి, పెళ్లిళ్లు చేశారు. పిల్లలను ప్రయోజకులను చేసి తమ బాధ్యతలు నిర్వర్తించారు. వృద్ధాప్యంలో కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ దంపతులు అన్యోన్య జీవితం గడిపారు. జీవిత చరమాంకంలో గ్రామంలోనీ చిన్న కొడుకు పరమేష్ ఇంట్లో ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్య ఎల్లమ్మ బాగోగులను వీరయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి అంత్యక్రియలను సోమవారం చేయనున్నట్లు కొడుకులు, బంధువులకు భర్త వీరయ్య సమాచారం అందించారు. భార్య మృతదేహం వద్ద కుమిలిపోతూ కూర్చున్న భర్త వీరయ్య అదే రోజు అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుమారులు స్థానికంగా చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి వీరయ్య అర్ధరాత్రి మృతి చెందాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు మృత్యువులోనూ కలిసి లోకాన్ని వీడడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు. వీరయ్య, ఎల్లమ్మలకు బంధువులు సోమవారం మిర్యాల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.