AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకోర్టులో RGVకి దక్కని ఊరట.. ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

దర్శకుడు రాంగోపాల్ వర్మ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన ఎక్కడున్నారు? ఎటెళ్లిపోయారు? అంటూ అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఏపీలో ఆయనపై నమోదైన వరుస కేసుల్లో ముందస్తు బెయిల్ కు అప్లై చేస్తే అదికాస్తా రేపటికి వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం వర్మ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు..

హైకోర్టులో RGVకి దక్కని ఊరట.. ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
Director Ram Gopal Varma
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 26, 2024 | 1:26 PM

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో నవంబర్‌ 27న ఆర్జీవీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఆర్జీవీ ఆచూకీ కోసం రెండు బృందాలుగా ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దీంతో ఆయన ఎక్కడ? తెలుగు స్టేట్స్‌లోనే ఉన్నారా?. అసలు ఎక్కడున్నారు?. ఇది కనిపెట్టే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న దానిపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో వేరువేరుగా ఆర్జీవీపై పోలీస్‌ స్టేషన్లో కేసులు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఒంగోలులో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాలేదు. దీంతో ఏపీ పోలీసులు ఆయనను వెతికే పనిలో పడ్డారు. ఆర్జీవీ తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ రేపటికి వాయిదా వేసింది. ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు  హైదరాబాద్, తమిళనాడులో వేట సాగిస్తున్నారు.

ఒంగోలు విచారణకు డుమ్మా కొట్టిన ఆయన ఈనెల 23న కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్టు ఫొటోలు, నటులతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో వర్మ పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రామ్‌గోపాల్‌వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌, తమిళనాడు పోలీసులతో ఎస్పీ దామోదర్ సంప్రదింపులు జరిపారు. ఇంత గందరగోళంగా ఉంటే ఆర్జీవీ మాత్రం అజ్ఞాతం వీడటం లేదు. ఆయన ఆచూకీ కోసం గత 2 రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ నివాసం, శంషాబాద్‌లోని ఫామ్ హౌస్‌లోనూ ఏపీ పోలీసులు తనిఖీలు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ ఆర్జీవీ కోసం ఏపీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇక ‘ఆర్జీవీ మిస్సింగ్’ నెటిజన్లు సైతం నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. వర్మ అసలెక్కడున్నారో?

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.