చైతన్య, శోభితా పెళ్లి అలనాటి సంప్రదాయాన్ని గుర్తు చేస్తుందా.. వివాహం గురించి కీలక అప్డేట్..

అక్కినేని వారింట పెళ్లి భాజాల మ్రోగడానికి సమయం రోజుల్లోకి వచ్చేసింది. డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే వధూ వరుల ఇంట్లో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. మరోవైపు ఈ పెళ్ళికి సంబంధించిన ఆహ్వానాలు ప్రముఖులకు అందుతున్నాయి. అయితే అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహానికి సంబంధిన కీలక వార్త వినిపిస్తోంది.

చైతన్య, శోభితా పెళ్లి అలనాటి సంప్రదాయాన్ని గుర్తు చేస్తుందా.. వివాహం గురించి కీలక అప్డేట్..
Chaitanya Shobhita Wedding
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2024 | 1:20 PM

స్టార్ కపుల్ నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4 న హిందూ సాంప్రదాయం ప్రకారం జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకని అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ జంట ఎనిమిది గంటల వివాహ వేడుకకు సిద్ధమవుతున్నారని ఓ వార్త వినిపిస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుకను పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారట. తెలుగు బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం వివాహ క్రతువుకి 8 గంటలకు పైగా సమయం పడుతుందని.. దీంతో ఈ వివాహ వేడుకలు సుదీర్ఘ సమయం జరగబోతున్నాయని శోభితకు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తెలుగు బ్రాహ్మణ వివాహంలో జరిగే ప్రతి కార్యం నిర్వహించనున్నారని తెలుస్తోంది. చైతన్య శోభితల పెళ్ళికి సుముహర్తం 4వ తేదీ రాత్రి 8.13 గంటలు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం జరగనుంది. వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ఈ జంటకు పెళ్లి రోజు తెలుగు బ్రాహ్మణ పెళ్లి సాంస్కృతిక మూలాలను ప్రతిబింబిస్తుందని అంటున్నారు. శోభిత నిజమైన బంగారు జరీతో తయారు చేసిన క్లాసిక్ కాంజీవరం పట్టు చీరను పెళ్లి సమయంలో దరించనున్నట్లు తెలుస్తోంది. సాంప్రదాయంతో జరిగే ఈ పెళ్లి వేడుక సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ఈ పెళ్లికి 300 మంది గెస్ట్ లు హాజరుకానున్నట్టు సమాచారం.

ఈ జంట వివాహ ఆహ్వానానికి సంబంధించిన ఫోటో ఇటీవల వైరల్‌గా మారింది. అందులో కుటుంబ పేర్లు, వివాహ తేదీ చెక్క స్క్రోల్, ఆహార ప్యాకెట్లు , స్వీట్లతో నిండిన ఆలోచనాత్మక బహుమతులు ఉన్నాయి. ఆహ్వాన పత్రం రూపకల్పనలో దేవాలయాలు, గంటలు, అరటి చెట్లు, ఆవు వంటి చిహ్నాలు ప్రత్యేక సందర్భానికి సాంస్కృతిక ఫ్లెయిర్‌ను జోడించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!