AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా 9 ఎయిర్‌పోర్టులు.. కూటమి సర్కార్ భారీ ప్లాన్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?

ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరిన్ని జిల్లాలకు విమాన కనెక్టివిటీ భవిష్యత్తులో ఏర్పడనుంది. దీని వల్ల రాష్ట్రంలోని ఏ మూలకైనా సులువుగా చేసుకోవచ్చు. అలాగే సరుకు రావాణా కూడా వేగంగా జరుగుతుంది. ఈ మేరకు తొమ్మిది ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా 9 ఎయిర్‌పోర్టులు.. కూటమి సర్కార్ భారీ ప్లాన్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?
airport
Venkatrao Lella
|

Updated on: Feb 17, 2026 | 1:41 PM

Share

ఏపీలోని కూటమి సర్కార్ ప్రజా రవాణా, సరకు రవాణాను రాష్ట్రంలో మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రయాణాన్ని వేగవంతం చేయడం, సరుకు రవాణాలో వేగం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా.. ఈ ఏడాదిలో మరో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. దీంతో మొత్తం ఏడు ఎయిర్‌పోర్ట్‌లు ఉండనున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విమాన కనెక్టివిటీని తెచ్చేందుకు మరో 9 ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ప్లాన్లు రూపొందిస్తోంది. ఇందుకోసం రూ.6,417 కోట్లతో ప్రతిపాదనలను సిద్దం చేసింది.

కొత్తగా 9 ఎయిర్‌పోర్ట్‌లు

ఏపీలో మరో 9 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళికలు రూపొందించారు. వీటి కోసం రూ.6,417 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యమై వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడపలో విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా.. మరికొద్ది నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వీటిని నిర్మించేందుకు ప్లాన్ రూపొందించింది. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ఎక్కడినుంచి ఎక్కడికైనా వెంటనే చేసుకోవచ్చు. దీని వల్ల సరుకు రవాణా పెరిగే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఎక్కడెక్కడంటే..?

-నెల్లూరు జిల్లా దగదర్తి దగ్గర ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.916 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభించనున్నారు.

-చిత్తూరు జల్లా కుప్పంలో ఎయిర్‌పోర్ట్ కోసం 444 ఎకరాల భూమిని సేకరించనున్నాయి. ఈ విమనాశ్రయం నిర్మాణానికి రూ.1,142 కోట్లు అవసరమవుతాయని భావించారు.

-రాజధాని అమరావతి, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి ప్లాన్ వేశారు. అమరావతి ఎయిర్‌పోర్ట్‌కు రూ.వెయ్యి కోట్లు, శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి రూ.650 కోట్ల వ్యయం అవ్వనుంది.

-కాకినాడ జిల్లా తుని-అన్నవరం మధ్య, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్, ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం డీపీఆర్ రెడీ చేస్తున్నారు.

కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం

ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే స్దానికంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. దీంతో వల్ల చెన్నై, బెంగళూరుకు ఇక్కడ నుంచి వేగంగా సరుకు రవాణా జరుగుతుంది. దీని వల్ల లాజిస్టిక్స్ బిజినెస్ పెరుగుతోంది. కొత్త ఉద్యోగులు కూడా దీని ద్వారా ఏర్పడతాయి. స్థానిక యువతకు దీని వల్ల లాభం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

Follow Us