AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇల్లంతకుంటలో పెద్దపులి దాడి…నాలుగు ఆవులు మృతి… గ్రామంలో భయాందోళనలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ సమీపంలో పెద్దపులి దాడి తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి పొలాల్లో మేస్తున్న నాలుగు ఆవులను పులి చంపివేయడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పశువులను కోల్పోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి పులి సంచారాన్ని ధృవీకరించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇల్లంతకుంటలో పెద్దపులి దాడి…నాలుగు ఆవులు మృతి... గ్రామంలో భయాందోళనలు...
Rajanna Sircilla Tiger Terr
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 1:49 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి అడవి మృగం సంచారం భయాన్ని రేకెత్తించింది. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ పరిధిలో గిద్దగట్టు గుట్ట సమీపంలోని పంట పొలాల్లో అర్ధరాత్రి పెద్దపులి దాడి చేసి నాలుగు ఆవులను చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు మల్లయ్య తన మూడు ఆవులను, మరో రైతు సుధాకర్ ఒక ఆవును పొలాల్లో కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో అడవివైపు నుంచి వచ్చిన పెద్దపులి పశువులపై దాడి చేసి వాటిని చీల్చి చంపేసింది. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు రక్తపు మరకలు, చీల్చివేయబడిన పశువులను చూసి షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల పులి అడుగుల ముద్రలు గుర్తించి ఇది పెద్దపులి దాడేనని నిర్ధారించారు. పులి గ్రామ పరిసరాల్లోనే తిరుగుతున్న అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామస్తులు గుంపులుగా తిరగాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఒక్కసారిగా నాలుగు పశువులు మృతి చెందడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పశువులే తమ జీవనాధారం అని, వెంటనే పరిహారం అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

పెద్దపులి గ్రామానికి సమీపానికే రావడంతో తిప్పాపూర్‌లో భయం నెలకొంది. పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతుండగా, రైతులు పొలాలకు వెళ్లడానికే వెనుకంజ వేస్తున్నారు. పులిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇల్లంతకుంటలో పెద్దపులి దాడి…నాలుగు ఆవులు మృతి..గ్రామంలో భయాందోళన
ఇల్లంతకుంటలో పెద్దపులి దాడి…నాలుగు ఆవులు మృతి..గ్రామంలో భయాందోళన
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
'ఆ రోజుల్లో డైరెక్టర్ వినాయక్ అనగానే.. ఆయనెవరు అన్నా.?'
'ఆ రోజుల్లో డైరెక్టర్ వినాయక్ అనగానే.. ఆయనెవరు అన్నా.?'
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్.. ఈ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్.. ఈ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
శరీరంలో ఏ అవయవం ఎక్కువగా పనిచేస్తుందో తెలుసా..?
శరీరంలో ఏ అవయవం ఎక్కువగా పనిచేస్తుందో తెలుసా..?
రాజస్థాన్ రాయల్స్‌లో చేరనున్న గౌతమ్ గంభీర్..
రాజస్థాన్ రాయల్స్‌లో చేరనున్న గౌతమ్ గంభీర్..
ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఈ 3 అద్భుత ఆహారాలతో చెక్..
ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఈ 3 అద్భుత ఆహారాలతో చెక్..
చేదుగా ఉందని ఛీ..ఛీ అంటున్నారా..? ఆరోగ్యానికి అమృతం ఈ జ్యూస్‌..
చేదుగా ఉందని ఛీ..ఛీ అంటున్నారా..? ఆరోగ్యానికి అమృతం ఈ జ్యూస్‌..
రికార్డులు బద్దలుకొట్టిన భారత్, పాక్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
రికార్డులు బద్దలుకొట్టిన భారత్, పాక్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?