AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారాన్ని మించిన నీలం! ప్రపంచంలో అత్యంత ఖరీదైన రంగు రహస్యం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

నీలం చాలా మందికి ఇష్టమైన రంగు. ఒకప్పుడు తెల్లని బట్టలకు తప్పనిసరిగా నీలం రంగు వేసేవారు. ఇప్పుడు ఈ అలవాటు కాస్త తగ్గిపోయిందని చెప్పాలి. దుస్తులలో, ఆకాశంలో, సముద్రంలో మనం చూసే నీలం రంగు ఒకప్పుడు బంగారం కంటే ఖరీదుగా ఉండేదని మీకు తెలుసా..? అవును, ఒకప్పుడు నీలం రంగు కొనడానికి బంగారం అమ్ముకోవాల్సి వచ్చేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇది వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, రంగులలో నీలం చరిత్ర రాయల్ మాత్రమే కాదు, అద్భుతమైనది కూడా. ఆ కథేంటో ఇక్కడ చూద్దాం..

బంగారాన్ని మించిన నీలం! ప్రపంచంలో అత్యంత ఖరీదైన రంగు రహస్యం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Blue Colour
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2026 | 8:39 AM

Share

ఒకప్పుడు నీలం రంగు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థంగా అమ్ముడయ్యేదని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో నీలం కేవలం రంగు మాత్రమే కాదు, సంపదకు చిహ్నంగా కూడా పరిగణించేవారు. నీలం చరిత్ర చాలా పాతది. ఎంతో ఆసక్తికరంగా కూడా ఉంది. ఒకప్పుడు నీలం రంగు కొనాలంటే బంగారం అమ్ముకోవాల్సి వచ్చేదని చెబుతున్నారు. ఆ సమయంలో దీనిని అల్ట్రామెరైన్ బ్లూ అని కూడా పిలిచేవారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రంగుగా పరిగణించబడింది. దాని ధరకు ప్రధాన కారణం దానిని తయారు చేయడానికి ఉపయోగించే రాయి.

నీలం రంగు కథ 6,000 సంవత్సరాల నాటిది. దీని ప్రారంభం ఆఫ్ఘనిస్తాన్‌లోని ‘సార్-ఎ-సాంగ్’లో ప్రారంభమవుతుంది. అక్కడ, లాపిస్ లాజులి అనే రాయి కనుగొనబడింది. దానిలో బంగారం వంటి కణాలు ఉన్నాయి. ఆ సమయంలో రంగును తయారు చేసే ప్రక్రియ చాలా కష్టం. ఎంతో శ్రమ తరువాతే నీలం రంగు బయటకు వచ్చింది. అందుకే నీలం రంగుల ధర చాలా ఎక్కువగా ఉండేది. అల్ట్రామెరైన్ బ్లూ అనే రంగుకు ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఈ రంగు వాణిజ్యం ద్వారా సముద్రం దాటి యూరప్‌లోని వెనిస్‌కు చేరుకున్నప్పుడు, అక్కడి ప్రజలు దీనికి ఓల్ట్రెమేర్ అని పేరు పెట్టారు. దీని అర్థం సముద్రం దాటి. నీలం బంగారం కంటే ఖరీదైనది కాబట్టి, అది క్రమంగా సంపదకు చిహ్నంగా మారింది.

నీలం రంగు ఎప్పుడూ ఇతర రంగుల కంటే ప్రకాశవంతంగా ఉండేది. దాని అధిక ధర కారణంగానే మైఖేలాంజెలో వంటి కళాకారులు తమ చిత్రాలను అసంపూర్తిగా వదిలివేశారని ప్రచారం. ఎందుకంటే అంత ఖరీదైన రంగును కొనడానికి వారి వద్ద సరిపడా డబ్బు లేదని అంటారు. 19వ శతాబ్దం నాటికి అల్ట్రామెరైన్ మరింత ఖరీదైనదిగా మారింది. దాంతో కళాకారులు తమ చిత్రాలలో ఈ రంగును ఉపయోగించడం మానేశారు. ఈ క్రమంలోనే 1826లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జీన్-బాప్టిస్ట్ గుయిమెట్ ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. అతను తన ప్రయోగశాలలో రసాయనాలను కలిపి ఇలాంటి నీలిరంగును సృష్టించాడు. దానికి ఫ్రెంచ్ అల్ట్రామెరైన్ అని పేరు పెట్టాడు.

ఇవి కూడా చదవండి
Blue Colour

Blue Colour

ఈ రోజుల్లో నీలిరంగు పెయింట్ తక్కువ ధరకు లభిస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ, అది పూర్తిగా నిజం కాదు. నేడు మనం కొనే నీలిరంగు పెయింట్ ప్రయోగశాలలో తయారు చేయబడిన కృత్రిమ రంగు. మీరు లాపిస్ లాజులి అనే రాతితో తయారు చేసిన పెయింట్‌ను కొనుగోలు చేస్తే, అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింట్‌లలో ఒకటి. మీరు అలాంటి పెయింట్ చిన్న ట్యూబ్ (37 మి.లీ) కొనుగోలు చేయాలంటే, దాని ధర దాదాపు రూ. 25,000ల వరకు ఉంటుంది. దీంతో పోల్చితే సాధారణ సింథటిక్ పెయింట్ ధర కొన్ని రూపాయలు మాత్రమే ఉంటుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us