AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: నేను ముందే చెప్పా.. టీమిండియాను ఓడించాలంటే కచ్చితంగా ఆ దేవుడే దిగి రావాలి

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత్-పాకిస్తాన్ క్రికెట్ పోటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి అనంతరం, భారత్-పాక్ మధ్య నిజమైన రైవలరీ లేదని, అది కేవలం వట్టి ప్రచారంతో వచ్చిన హైప్ మాత్రమేనని పాంటింగ్ అన్నారు. టీమ్ ఇండియా ఆధిపత్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

T20 World Cup: నేను ముందే చెప్పా.. టీమిండియాను ఓడించాలంటే కచ్చితంగా ఆ దేవుడే దిగి రావాలి
Team India
Ravi Kiran
|

Updated on: Feb 17, 2026 | 1:50 PM

Share

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అభిమానులతో పాటు ఆటగాళ్ళలో కూడా ఈ మ్యాచ్‌లకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. అయితే, టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైన అనంతరం, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య అసలైన రైవలరీ లేదని, ఇది కేవలం ప్రచారంతో వచ్చిన హైప్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించి 77 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించారు. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయ్యారు, దీంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఏ సమయంలో కూడా పాకిస్తాన్ టీమ్ ఇండియాపై ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది.

ఈ మ్యాచ్ ఫలితం, ప్రస్తుత టీమ్ ఇండియా బలాన్ని ఉటంకిస్తూ రికీ పాంటింగ్ తన వ్యాఖ్యలను మరింత వివరించారు. “నేను ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోటీ లేదు. ప్రపంచ క్రికెట్‌లో ఒక జట్టు నంబర్ వన్ స్థానంలో ఉండి మరో జట్టు ఎనిమిది లేదా పదో స్థానంలో ఉంటే ఆ మ్యాచ్‌ను రైవలరీగా పిలవలేం. భారత్ పాకిస్తాన్ మధ్య పోరు రైవలరీ కాదు, ఇది ఫేక్ మాత్రమే” అని పాంటింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాల ప్రాధాన్యంపై చర్చకు దారితీశాయి.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పాంటింగ్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు ఐసీసీ టీ20 టోర్నీలలో పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి పాకిస్తాన్ గెలిస్తే, ఎనిమిది సార్లు టీమ్ ఇండియా గెలిచింది. టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా టీమ్ ఇండియా మొదటి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది. ఈ గణాంకాలు టీమ్ ఇండియా ఆధిపత్యాన్ని బలపరుస్తున్నాయి. ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియానే ఫేవరెట్ అని, టీమ్ ఇండియాను ఓడించాలంటే ప్రత్యర్థి జట్లకు రెండు జట్ల బలం కావాలని, అలా అయితేనే టీమ్ ఇండియాను ఓడించే అవకాశం ఉంటుందని రికీ పాంటింగ్ అన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ హోమ్ టీమ్‌కు ఎదురే లేదని ఆయన పేర్కొన్నారు.

Follow Us
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ