Winter Travel Tips: శీతాకాలంలో ఉత్తరప్రదేశ్‌లోని ఈ ప్రదేశాలు సందర్శించడానికి ఉత్తమమైనవి

శీతాకాలంలో కుటుంబంతో కలిసి పర్యటించడం కొత్త ప్రదేశాలు చూడడం ఒక మంచి అనుభూతినిస్తుంది. చాలా మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వివిధ ప్రదేశాలు సందర్శించడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఈ సీజన్‌లో పచ్చదనం, ప్రకృతి అందాలతో నిండిన ప్రదేశాలను సందర్శించాలనుకుంటే ఉత్తరప్రదేశ్‌లోని ఈ ప్రదేశాలను అన్వేషించవచ్చు.

Winter Travel Tips: శీతాకాలంలో ఉత్తరప్రదేశ్‌లోని ఈ ప్రదేశాలు సందర్శించడానికి ఉత్తమమైనవి
Uttar PradeshImage Credit source: social media
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2024 | 12:57 PM

వింటర్‌ సీజన్‌లో ప్రయాణం చేస్తే అప్పుడు వచ్చే మజా వేరు. చల్లని గాలి , లేలేత సూర్య కిరణాలు శీతాకాలంలో యాత్రను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. కొందరు వ్యక్తులు ఈ సీజన్‌లో పర్వతాలపై మంచు కురుస్తున్నప్పుడు ఆస్వాదించడానికి ఉత్తరాఖండ్, హిమాచల్‌లోని అనేక ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తారు. మరికొందరు పచ్చదనంతో నిండిన ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది రాజస్థాన్, దక్షినాదిలోని అనేక ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేస్తారు. మీరు కూడా శీతాకాలంలో మీ కుటుంబం, స్నేహితులతో ఉత్తర ప్రదేశ్‌లోని ఈ ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు. అప్పుడు ఆధ్యాత్మిక యాత్ర, ప్రకృతికి దగ్గరగా గడిపిన భిన్నమైన అనుభవం మీ సొంతం అవుతుంది.

చుకా బీచ్ చుకా బీచ్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ శివార్లలో ఉంది. ఇది శారదా సాగర్ డ్యామ్ ఒడ్డున పచ్చని అడవుల మధ్య ఉంది. బరేలీ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 1 గంట పడుతుంది. ఈ బీచ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నగరంలోని రణగొణధ్వనులకు దూరంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటే చుకా బీచ్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. అలాగే ఇక్కడ మీరు అనేక రకాల కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది.

లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, నవాబీ సంస్కృతికి, అద్భుతమైన చారిత్రక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వాతావరణం శీతాకాలంలో చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ బడా, ఛోటా ఇమాంబరా, మెరైన్ డ్రైవ్, రూమీ గేట్, జూ, జనేశ్వర్ మిశ్రా పార్క్, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌లను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఝాన్సీ ఝాన్సీ చరిత్ర చాలా మందికి తెలుసు. ఇక్కడ వాకింగ్ ఓ వింత అనుభూతిని ఇస్తుంది. ప్రత్యేకించి చారిత్రక ప్రదేశాలను అన్వేషణ అంటే ఇష్టమైన వారికి ఝాన్సీని సందర్శించడం ఒక మంచి జ్ఞాపకం. ఇక్కడ ఝాన్సీ కోట, రాణి లక్ష్మీ బాయి ప్యాలెస్, రాజా గంగాధర్ రావు గొడుగు, ఝాన్సీ మ్యూజియం వంటి వాటిని చూడవచ్చు.

వారణాసి శీతాకాలంలో వారణాసిని సందర్శించడం ఒక భిన్నమైన అనుభూతి. వారణాసి హిందూ మత విశ్వాసానికి కేంద్రం. ఇక్కడికి వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గంగా నది ఘాట్‌లపై పొగ, పొగమంచు, శాంతి వాతావరణం.. చుట్టుపక్కల ఉన్న సహజ దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం, దుర్గా దేవాలయం, అనేక దేవాలయాలను సందర్శించవచ్చు. అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, రాంనగర్ కోట ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాయి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..