AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పిల్లల టిఫిన్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. ఆరోగ్యానికి ముప్పు..

పిల్లలకైనా, పెద్దలకైనా ఆహారం అంటే కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడానికి. అయితే పిల్లల ఆహారం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. పిల్లలకు సరైన పోషకాహారం అందించడానికి మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. పిల్లల ఒత్తిడి వల్లనో, సమయాభావం వల్లనో మధ్యాహ్నం తినే ఆహారంగా.. లేదా టిఫిన్‌లో జంక్ ఫుడ్ వంటివి ప్యాక్ చేస్తూ ఉంటారు. కొన్ని రకాల ఆహారం వలన పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

Health Tips: పిల్లల టిఫిన్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. ఆరోగ్యానికి ముప్పు..
Children Lunch Box
Surya Kala
|

Updated on: Nov 26, 2024 | 10:34 AM

Share

పిల్లలకు టిఫిన్, లంచ్ తయారుచేసే సమయంలో ప్రతి తల్లి ఈ రోజు తమ పిల్లలకు ఏ ఆహారం అందించాలి అనే విషయం గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే పిల్లలు బాక్స్ లో పెట్టిన ఆహారం నచ్చక పొతే దానిని ఇంటికి తిరిగి తీసుకువస్తారు. ఇలా తినీ తినకుండా ఉంటే పిల్లల శరీరానికి సరైన పోషకాహారం లభించదు. తమ పిల్లలు టిఫిన్ తినాలని వారికి ఇష్టమైన ఆహరాన్ని బాక్స్ లో పెడతారు. నిజానికి టిఫిన్ అనేది పిల్లలకు పోషకాలు అధికంగా ఉండే ఆహారాల నిధిగా ఉండాలి. కానీ కొన్నిసార్లు పిల్లల ఒత్తిడి కారణంగా వారికి నచ్చిన ఆహారాన్ని టిఫిన్‌లో ప్యాక్ చేసి ఇస్తారు. తద్వారా పిల్లలు ఆకలితో ఉండరు అని భావిస్తారు. అయితే ఇలా చేయడం వలన పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

ఈ రోజుల్లో చిన్నపిల్లలతో పాటు పెద్దవారు జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తిని ఎక్కువ చూపిస్తున్నారు. దీంతో పిల్లలు టిఫిన్‌ బాక్స్ లో ఇంట్లో తయారు చేసిన ఆహారం కంటే తమకు జంక్ ఫుడ్స్‌ ప్యాక్‌ చేయాలని కోరుతున్నారు. పిల్లల పట్టుదల వలన లేదా సమయం లేకపోవడం వల్ల టిఫిన్‌ బాక్స్ లో పిల్లలకు కొన్ని రకాల ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొని రకాల ఆహారాలు ఇవ్వడాన్ని పూర్తిగా నివారించాలి. ఈ రోజు పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఏయే ఆహార పదార్థాలను ప్యాక్ చేయకూడదో తెలుసుకుందాం.

అధిక కొవ్వు పదార్థాలు ఇవ్వవద్దు

పిల్లలు ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్‌లో చాలా నూనె ఉంటుంది. బంగాళాదుంపలలో స్టార్చ్ ఉంటుంది. దీనితో పాటు మయోనైస్, సాస్ తింటే ఫ్రెంచ్ ఫ్రైస్ మరింత అనారోగ్యకరం.. అందువల్ల, పిల్లల టిఫిన్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఏదైనా అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని పెట్ట వద్దు అంటూ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టంట్ నూడుల్స్ ఆరోగ్యానికి శత్రువు

సమయాభావం వల్ల పిల్లలకు టిఫిన్‌లో ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాక్ చేసి ఇస్తున్నారు. అయితే ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్ పిల్లల ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు. నూడుల్స్ చాలా వరకు మైదా పిండితో తయారు చేయబడతాయి. ఆరోగ్యానికి చాలా హానికరమైన రసాయనాలు కలుపుతారు. కనుక పొరపాటున కూడా పిల్లలకు ఇన్‌స్టంట్ నూడుల్స్ ఇవ్వకూడదు. బదులుగా మిశ్రమ ధాన్యాల పిండితో తయారు చేసిన ఇంట్లో నూడుల్స్ ను వివిధ కూరగాయలతో తయారు చేసి నూడుల్స్ ను పిల్లలకు ఇవ్వండి.

టిఫిన్‌ బాక్స్ లో చాక్లెట్, టోఫీలు వద్దు

స్కూల్‌కి వెళ్లే సమయంలో పిల్లలు చాక్లెట్, టోఫీ కావాలంటూ పట్టుబడతారు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు వారికి ఈ ఆహారాన్ని అందిస్తారు. అయితే ఎక్కువ తీపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల టిఫిన్ బాక్స్ లో లేదా ఇంట్లో కూడా పిల్లలకు చాక్లెట్, టోఫీలు ఇచ్చే విషయంలో పరిమితం చేయండి. పిల్లలకు లంచ్ బాక్స్ లో భోజనంతో పాటు తినడానికి పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి.

మైదాతో చేసిన ఆహారం

మాకరోనీ, పాస్తా, బర్గర్ వంటి ఆహారపదార్థాలు పొరపాటున కూడా పిల్లల టిఫిన్‌ బాక్స్ లో ఉంచకూడదు. వీటిని మైదా పిండితో తయారు చేస్తారు. పిల్లలు ఒకసారి తిన్న తర్వాత మళ్లీ మళ్లీ ఇలాంటి ఆహారం కావాలని అడుగుతారు. అయినా సరే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.. ఇవి పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)