AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja on Charan: చిరు అంటే అభిమానమే.. చరణ్ ని ఎత్తుకుని పెంచా.. అలాంటి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా అంటున్న రోజా

సినీ నటి, వైసీపీ నేత, మాజీ మంత్రి, జబర్దస్త్ మాజీ హోస్ట్ రోజా మళ్ళీ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని.. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ వస్తే.. అంటే అత్తారింటికి దారేది సినిమాల్లో నదియా వంటి పాత్ర, శివగామి వంటి పాత్రలు వచ్చినా డాక్టర్ లాయర్ వంటి క్యారెక్టర్స్ వస్తే తాను వెండి తెరపై మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. అంతేకాదు మాజీ మంత్రి రోజా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

Roja on Charan: చిరు అంటే అభిమానమే.. చరణ్ ని ఎత్తుకుని పెంచా.. అలాంటి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా అంటున్న రోజా
Roja On Ram Charan
Surya Kala
|

Updated on: Nov 26, 2024 | 10:04 AM

Share

శ్రీలత రెడ్డి అంటే తెలియదు కానీ.. రోజా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పని లేని పేరు. హీరోయిన్ గా రాజకీయ నేతగా రోజా ఓ సంచలనం. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ప్రేమ తపస్సు సినిమాతో రోజా వెండి తెరపై అడుగు పెట్టింది. సర్పయాగం సినిమాలో శోభన్ బాబు కూతురుగా నటించిన రోజా తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.. కెరీర్ లో దూసుకుపోయింది. చామంతి సినిమాతో పరిచయం అయిన దర్శకుడి సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పాటు అలీ వంటి వారితో కూడా నటించిన వెండి తెరపై తన కంటూ పేరు తెచ్చుకున్న రోజా.. కాలక్రమంలో తెలుగు దేశం పార్టీలో చేరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన రోజా స్వర్గీయ వైఎస్ఆర్ మరణం అనంతరం వైసిపీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ నుంచి నగరి ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ పర్యాటక మంత్రిగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన రోజా గత కొంతకాలంగా పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా రోజా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మళ్ళీ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని.. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ వస్తే.. అంటే అత్తారింటికి దారేది సినిమాల్లో నదియా వంటి పాత్ర, శివగామి వంటి పాత్రలు వచ్చినా డాక్టర్ లాయర్ వంటి క్యారెక్టర్స్ వస్తే తాను వెండి తెరపై మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తానని చెప్పారు.

అంతేకాదు మాజీ మంత్రి రోజా రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి అంటే బెధలున్నా.. నటనలో మాత్రం చిరంజీవి అంటే ఇష్టమని.. ఏ రోజూ తాను చిరంజీవి బాధపడేలా మాట్లాడలేదు అని చెప్పింది. చిరంజీవి భార్య సురేఖ తనను చాలా బాగా చూసుకునేది అని.. పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడను అంతే అని చెప్పారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి కూడా పలు విషయాలను చెప్పారు. ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చిన రామ్ చరణ్ అల్లరిని గుర్తు చేసుకున్నారు. తాను రామ్ చరణ్ ని ఎత్తుకుని పెంచానని.. చిన్నప్పుడు చరణ్ చాలా అల్లరి పిల్లవాడు.. స్కూల్ లో చేరిన తర్వాత అల్లరి తగ్గింది.. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ను చూసి తాను చాలా గర్వపడినట్లు చెప్పారు. చరణ్ డ్యాన్స్ చేస్తుంటే తనకు చిరంజీవి కనిపిస్తారని.. చిన్నతనం నుంచి చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేసేవాడు అంటూ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది రోజా.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వంలో చేయనున్న సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.