Rashmika Mandhanna: తన కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక.! ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్‌షిప్‌పై కొన్ని సంవత్సరాలుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఎప్పుడూ ఖండించలేదు, అలాగని అంగీకరించలేదు కూడా. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటనేది వారికి తప్ప ఎవరికీ తెలియదు. అయితే ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రష్మిక మందన్న..
మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవారా కాదా?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ” ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కోరుకున్న సమాధానం ఇదేనని నాకు తెలుసు’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. రష్మిక సమాధానం విని అభిమానులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. పేరు చెప్పకుండా విజయ్ దేవరకొండతో బంధాన్ని ఆమె అంగీకరించిందని, ఈ వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. యాదృచ్ఛికంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న శ్రీలంకలోని ఓ ప్రదేశంలో లంచ్ చేస్తున్న ఫొటోలు ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ-12 సినిమా షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫొటో అంటూ కథనాలు పేర్కొన్నాయి.
కాగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తొలిసారిగా 2018లో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి తరచూ ట్రిప్‌లకు వెళ్లడం, ప్రత్యేక సందర్భాల్లో కలిసి కనిపించడం సర్వసాధారణంగా మారిపోయింది. వీరిద్దరి బంధంపై విజయ్ దేవరకొండ ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను డేటింగ్‌లో ఉన్నానని ధ్రువీకరించాడు. ‘‘నాకు 35 సంవత్సరాలు. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా?’’ అని స్పష్టంగా చెప్పాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

