Childhood photo: మహానటి సావిత్రితో ఉన్న బాలనటుడు .. నేడు లోక నాయకుడు.. పేరు ఏమిటో తెలుసా..
వీరి వీరి గుమ్మడి పండు ఈ బాల నటుడు పేరు ఏమిటి అంటున్నారు.. అవును మహా నటి సావిత్రి గురించి సిని ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. వెండి తెరపై అడుగుపెట్టిన సావిత్రి తన నటనతో కనుల సైగతో పాత్రకు జీవం పోసి మహానటి. సినీ చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న అభినేత్రి. అలాంటి మహానటితో పాటు ఉన్న ఈ బాలనటుడు కూడా కాలక్రమంలో తన నటనతో విభిన్న సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
ఆపాత మధురం అన్న విషయం అందరికీ తెలిసిందే.. చిన్నతనంలో ఆడిన ఆటలు, పాటలు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరికీ ఎంతో మధుర జ్ఞాపకం. తమ చిన్నతనం ఎలా గడిచించి అనే విషయాన్నీ సమయం దొరినప్పుడు గుర్తు చేసుకుని సంతోషపడేవారు ఎందరో.. ముఖ్యంగా తమ చిన్నతనంలోని ఫోటోలను .. అప్పటి అమాయకత్వాన్ని, బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషపడతారు. తమ స్నేహితులకు, సన్నిహితులకు చెప్పి తమ బాల్యంలోని జ్ఞాపకాలని పంచుకుంటారు. ఇక సెలబ్రేటీలు, రాజకీయ నేతలు, క్రికెటర్లకు సంబంధించిన చిన్నతనంలోని ఫోటోలు అంటే అభిమానులు అంత్యంత ఇష్టం. వాటిని షేర్ చేస్తూ.. తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఒక ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో మహానటి సావిత్రి తో పాటు ఒక బాలనటుడు ఉన్నాడు. ఒక నాటి రేర్ ఫోటోలో ‘మహానటి సావిత్రి’ గారితో ఉన్న ఈ బాలనటుడు ఎవరో చెప్పగలరా? అంటూ నెటిజన్లకు సవాల్ విసురుస్తున్నారు. మరి ఆ బాలుడు ఎవరో మీరు గుర్తు పట్టగలరా..
వీరి వీరి గుమ్మడి పండు ఈ బాల నటుడు పేరు ఏమిటి అంటున్నారు.. అవును మహా నటి సావిత్రి గురించి సిని ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. వెండి తెరపై అడుగుపెట్టిన సావిత్రి తన నటనతో కనుల సైగతో పాత్రకు జీవం పోసి మహానటి. సినీ చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న అభినేత్రి. అలాంటి మహానటితో పాటు ఉన్న ఈ బాలనటుడు కూడా కాలక్రమంలో తన నటనతో విభిన్న సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. లోకనాయకుడిగా ఖ్యాతి గాంచాడు. అవును సావిత్రి తో ఉన్న బాలుడు నేటి మేటి మహానటుడు కమల్ హసన్.
మహానటి సావిత్రితో కలిసి చిన్నారి కమల్‌హాసన్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కమల్ హాసన్ సిని కెరీర్ బాలనటుడిగానే ప్రారంభం అయింది. 1960లో రిలీజైన కళత్తూర్ కణ్ణమ్మ తమిళ చిత్రంలో సావిత్రి, జెమినీ గణేష్‌ల కొడుకుగా కమల్ హాసన్ కనిపించాడు. మహా నటితో నటిస్తూ.. కమల్ హాసన్ తన నటనతో ప్రశంసలను అందుకున్నాడు. తర్వాత 1962 సంవత్సరంలో విడుదలైన ‘పార్తాళ్ పసి తీరుం’ (ఒక్క చూపు ఆకలిని తీరుస్తుంది) సినిమాలో కూడా మహానటి సావిత్రితో కమల్ హాసన్ కలిసి నటించాడు. కాలక్రమంలో కమల్ హాసన్ పెరిగి పెదయ్యాడు.. సావిత్రి స్టార్ డమ్ తగిరిపోయింది. చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది. అలా కమల్‌హాసన్ నటించిన ‘అల్లావుద్దీన్ అద్భుద విలక్కుమ్’ తమిళ చిత్రంలో సావిత్రి ఓ చిన్న పాత్రలో నటించింది. 1979లో ఈ సినిమా విడుదలైంది. అయితే చిన్న వయసులోనే సావిత్రి 1981లో దివికేగింది. ఇప్పటికీ కమల్‌హాసన్ తన అభిమాన నటీమణి మహానటి సావిత్రి అని చెబుతారన్న సంగతి తెలిసిందే..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..