Bollywood: ఏళ్ల తరబడి మెడిసిన్స్ లేని వ్యాధులతో బాధపడుతున్న నటీనటులు.. సల్మాన్ నుంచి వరుణ్ ధావన్ వరకూ ఎందరో..

తెరపై ఎంతో అందంగా ఆనందంగా కనిపించే తారలు నిజజీవితంలో ఎన్నో వింత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ జాబితాలో చాలా మంది స్టార్లు చేర్చబడ్డారు. చలన చిత్ర పరిశ్రమలో తెరపై తమ నటనతో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అయితే వారి సమస్య గురించి పది మందికి తెలిసే విధంగా మాత్రం నడుచుకోరు. తన అభిమానులను అలరించడానికి తమ ముఖంలో ఎప్పుడు చిరు నవ్వు కనిపించేలా నడుచుకుంటారు. చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ తారలు చాలా మంది ఉన్నారని మీకు తెలుసా. ఈ జాబితాలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనేక పేర్లు వినిపిస్తాయి.

Bollywood: ఏళ్ల తరబడి మెడిసిన్స్ లేని వ్యాధులతో బాధపడుతున్న నటీనటులు.. సల్మాన్ నుంచి వరుణ్ ధావన్ వరకూ ఎందరో..
Bollywood Celebs
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2023 | 9:17 AM

బాలీవుడ్ పరిశ్రమలో తమ విలక్షణమైన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను  సంపాదించుకున్న స్టార్లు అనేకమంది ఉన్నారు. తమ పాత్రలకు అనుగుణం తమ శరీరాకృతిని , నటనను మార్చుకునే ఈ గ్లామర్ తారల వెలుగుల వెనుక బయట ప్రపంచానికి తెలియని ఎన్నో సమస్యలు దాగి ఉంటాయి. తమకు నచ్చిన మెచ్చిన ఆహారాన్ని తినలేదు. నచ్చిన ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరించలేరు. ఇంకా చెప్పాలంటే ఈ గ్లామర్ వెలుగు వెనుక జీవితంలో ఎన్ని సమస్యలు దాగి ఉన్నాయో తెలుసా..!  అవును, తెరపై ఎంతో అందంగా ఆనందంగా కనిపించే తారలు నిజజీవితంలో ఎన్నో వింత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ జాబితాలో చాలా మంది స్టార్లు చేర్చబడ్డారు.

చలన చిత్ర పరిశ్రమలో తెరపై తమ నటనతో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అయితే వారి సమస్య గురించి పది మందికి తెలిసే విధంగా మాత్రం నడుచుకోరు. తన అభిమానులను అలరించడానికి తమ ముఖంలో ఎప్పుడు చిరు నవ్వు కనిపించేలా నడుచుకుంటారు. చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ తారలు చాలా మంది ఉన్నారని మీకు తెలుసా. ఈ జాబితాలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనేక పేర్లు వినిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ మంచి ప్రాముఖ్యత ఇచ్చే తారలు కూడా ఎప్పుడు ఎవరూ వినని వింత వ్యాధులతో పోరాడుతూ ఉన్నారు. అంతేకాదు చాలా మంది నటీనటులకు ఉన్నటువంటి వ్యాధి.. ఏ మందులకు నయం చేయలేదు. ఎందుకంటే కొన్ని రకాల వ్యాధులకు సరైన మెడిసిన్ లేదు కనుక. ఈ రోజు మనం తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొంటున్న కొంతమంది నటీనటుల గురించి తెలుసుకుందాం..

వరుణ్ ధావన్:  బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. వరుణ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూలలో వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఈ వ్యాధి బారిన పడిన వారు తన శరీర సమతుల్యతను కోల్పోతారు.

సమంత : దక్షిణాది నుంచి బాలీవుడ్ లో అడుగు పెట్టిన సమంత స్టార్ హీరోయిన్లలో ఒకరు.  ఎంతో అందంగా కనిపించే సమంత మాత్రం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. తన వ్యాధి గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధిలో కండరాలు ఉబ్బుతాయి. దీని వల్ల ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

అజయ్ దేవగన్: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అజయ్ దేవగన్త. పవర్ ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు. తన నటనతో అభిమానులను అలరించే అజయ్ దేవగన్ నిజ జీవితంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అజయ్ టెన్నిస్ ఎల్బో తో మాత్రమే కాదు OCD సమస్య తో కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని కాజోల్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సల్మాన్ ఖాన్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ట్రైజెమినల్ న్యూరల్జియా అనే వ్యాధి తో ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. ఈ వ్యాధిబారిన పడిన వారు ఒకొక్కసారి భరించలేనంత నొప్పితో ఇబ్బంది పడతారు. ముఖం నుండి మెదడు వరకు నొప్పితో ఇబ్బంది పడతారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

సోనమ్ కపూర్: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ తన ఒక ఇంటర్వ్యూలో తనకు డయాబెటిస్ ఉందని చెప్పింది.  యుక్తవయస్సు నుండి ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించింది. అయితే తన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించింది. ఎప్పటి నుంచో మందులు ఉపయోగించడమే కాదు.. యోగా, వ్యాయామం చేయడం వంటివి కూడా చేస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!