Dunki : హైదరాబాద్‌లో డంకి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఈవెంట్.. ఎక్కడంటే
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకోవడంతో షారూఖ్ ఖాన్ పని అయిపొయింది అన్నవారు లేకపోలేదు. అదే సమయంలో కొంత గ్యాప్ తీసుకొని పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ ఖాన్. పఠాన్ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసింది. దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో చూపించాడు.

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న నయా మూవీ డంకి. ఈ ఏడాది షారుఖ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. చాలా కాలంగా హిట్స్ లేక సతమతం అయ్యారు షారుఖ్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకోవడంతో షారూఖ్ ఖాన్ పని అయిపొయింది అన్నవారు లేకపోలేదు. అదే సమయంలో కొంత గ్యాప్ తీసుకొని పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్ ఖాన్. పఠాన్ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసింది. దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో చూపించాడు. పఠాన్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆ తర్వాత జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.
సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా చేశాడు షారుఖ్. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. జవాన్ సినిమా ఏకంగా మరోసారి 1000 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు షారుఖ్.
షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజాగా చిత్రం డంకి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నాడు. అలాగే తాప్సి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే డంకి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 21న ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ ను ఇన్వైట్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

షారుఖ్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.