Movies: సినిమాలను ‘శుక్రవారం’ మాత్రమే ఎందుకు థియేటర్లలో రిలీజ్ చేస్తారో తెలుసా? పెద్ద కారణమే ఉంది
రణబీర్ కపూర్ నటించిన యానిమల్, విక్కీ కౌశల్ నటించిన షైమ్ బహదూర్ మువీలు శుక్రవారం (డిసెంబర్ 1) థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా సినిమాలను శుక్రవారం రోజునే విడుదల చేయడం ఇదేం మొదటిసారి కాదు. ప్రతి వారం సినిమాలు విడుదలవుతున్నా.. పెద్ద సినిమాలు మాత్రం ఒక్క శుక్రవారం నాడే విడుదలవుతాయి. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటనే విషయం చాలా మందికి తెలియదు..

రణబీర్ కపూర్ నటించిన యానిమల్, విక్కీ కౌశల్ నటించిన షైమ్ బహదూర్ మువీలు శుక్రవారం (డిసెంబర్ 1) థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా సినిమాలను శుక్రవారం రోజునే విడుదల చేయడం ఇదేం మొదటిసారి కాదు. ప్రతి వారం సినిమాలు విడుదలవుతున్నా.. పెద్ద సినిమాలు మాత్రం ఒక్క శుక్రవారం నాడే విడుదలవుతాయి. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటనే విషయం చాలా మందికి తెలియదు.
శుక్రవారం మాత్రమే సినిమాలు ఎందుకు విడుదలవుతాయంటే..
భారతీయ చిత్రసీమలో శుక్రవారమే సినిమాలు విడుదలవుతాయి. దీనికి వెనుక పెద్ద కారణమే ఉంది. చాలా కంపెనీల్లో శుక్రవారంతో పనిదినాలు ముగుస్తాయి. అంటే తదుపరి వచ్చే శని, ఆదివారాలు వారాంతపు సెలవులు ఉంటాయి. వరుస సెలవుల కారణంగా చాలా మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. ఇది సినిమా కలెక్షన్ పెంచేందుకు సహకరిస్తుంది. ఒక్కోసారి సినిమా విజయాన్ని కూడా నిర్ధారిస్తుంది. ఇక రెండో కారణం ఏంటంటే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల వరకు మన దేశంలో కలర్ టీవీలు అందుబాటులోకి రాలేదు. దీని కారణంగా అధిక మంది ప్రజలు సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లేవారు. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగులకు శుక్రవారాల్లో సగం రోజులు సెలవు ఇవ్వడంతో.. వారు కుటుంబ సమేతంగా సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లేవారు. దీని వల్ల సినిమా కలెక్షన్లు బాగా పెరిగేవి.
అసలు చరిత్ర ఇదీ?
భారతదేశంలో శుక్రవారం సినిమాలను విడుదల చేసే ఆచారం మన దేశంలో మొదటి నుంచి లేదు. ఈ ఆచారం దాదాపు 1940లో హాలీవుడ్‌లో ప్రారంభమైంది. 1960కి ముందు భారతదేశంలో సినిమాల విడుదలకు నిర్ణీత రోజంటూ ఉండేది కాదు. 1960లో మొఘల్-ఎ-ఆజం అనే చారిత్రాత్మక చిత్రం ఆగస్టు 5న విడుదలైంది. అది శుక్రవారం (ఆగస్ట్ 5) 1960నాడు విడుదలై విశేషాదరణ పొందింది. దీంతో అప్పటి నుంచి సినిమాల విడుదలకు దర్శకనిర్మాతలు శుక్రవారమే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే శుక్రవారం అన్ని సినిమాలు విడుదల కావు. చాలా మంది దర్శక నిర్మాతలు ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసి వేర్వేరు రోజుల్లో సినిమాలను విడుదల చేసి సక్సెస్‌ను అందుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.