JEE Mains 2024: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పొడిగించింది. జేఈఈ మెయిన్స్ తొలి విడత దరఖాస్తు గడువు నవంబర్ 30వ తేదీ (గురువారం రాత్రి)తో ముగియగా.. తాజాగా ఆ గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగిస్తూ ఎన్టీఏ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సవరించిన టైం టేబుల్‌ను వెల్లడించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవల్సిందిగా
హైదరాబాద్, డిసెంబర్ 1: జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పొడిగించింది. జేఈఈ మెయిన్స్ తొలి విడత దరఖాస్తు గడువు నవంబర్ 30వ తేదీ (గురువారం రాత్రి)తో ముగియగా.. తాజాగా ఆ గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగిస్తూ ఎన్టీఏ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సవరించిన టైం టేబుల్‌ను వెల్లడించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవల్సిందిగా సూచించింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1వ తేదీన మొదలైన సంగతి తెలిసిందే. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే వెబ్‌సైట్‌లో డిసెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు సవరించుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరగనుంది.
కాగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది. ఇక రెండోవిడత పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరుగుతుంది. జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న వెల్లడిస్తారు. తెలుగు సహా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ప్రధాన భాషల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో దాదాపు 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు.
డిసెంబర్ చివరి వారం వరకు 10 Special Trains పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
- సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు డిసెంబరు 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం
- తిరుపతి-సికింద్రాబాద్ (07481) డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం
- హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి శనివారం
- నర్సాపూర్-హైదరాబాద్ (07632) డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం
- కాకినాడ-లింగంపల్లి (07445) డిసెంబరు 1-29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో
- లింగంపల్లి-కాకినాడ (07446) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయల్దేరతాయి.
- తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య రెండు జతల ప్రత్యేక రైళ్లు తిరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో స్పష్టం చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.