AP Inter Exam Fee 2024: ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇంటర్‌ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్‌ 30తో గడువు ముగిసింది. ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ గురువారం (నవంబర్ 30) ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపుకు డిసెంబర్‌ 5 వరకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు..

AP Inter Exam Fee 2024: ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
AP Inter Exam Fee
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2023 | 1:28 PM

అమరావతి, డిసెంబర్‌ 1: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇంటర్‌ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్‌ 30తో గడువు ముగిసింది. ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ గురువారం (నవంబర్ 30) ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపుకు డిసెంబర్‌ 5 వరకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15 వరకు చెల్లించవచ్చు. మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి.

ఇంటర్‌ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1100, ఒకేషనల్‌ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సుకు రూ.300 ఫీజు చెల్లించాలి. ఇప్పటికే ఇంటర్‌ పాసై ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు రెండేళ్లకు కలిపి ఆర్ట్స్‌ కోర్సులకు అయితే రూ.1240, సైన్స్‌ కోర్సులకు అయితే రూ.1440 సంబంధిత కాలేజీల్లో చెల్లించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ వివరించారు.

ఎస్‌ఎస్‌సీ జేఈ (SSC JE ) టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో 1,324 జూనియర్‌ ఇంజినీర్‌ గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) నియామకాలకు సంబంధించి టైర్‌-2 (పేపర్‌-2) పరీక్ష రాసేందుకు అడ్మిట్‌ కార్డులను తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలు డిసెంబర్‌ 4వ తేదీన దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పేపర్‌-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదుచేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేపర్‌-1 ఆన్‌లైన్‌లో నిర్వహించగా.. పేపర్‌-2 పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో డిస్క్రిప్టివ్‌ మోడ్‌లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. కాగా పేపర్ 1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, కీలను డిసెంబర్‌ 13వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇప్పటికే కమిషన్‌ ఓ ప్రకటనలో తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!