AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Holidays 2024: వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు.. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసొచ్చిన పండగ దినాలు

ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్ఛిక సెలవుల క్యాలెండర్‌-2024ను ప్రభుత్వం గురువారం (నవంబర్‌ 30) విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2024 సంవత్సరానికి గానూ 20 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐచ్ఛిక (ఆఫ్షనల్‌ హాలిడేస్‌) సెలవులు 17 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా..

AP Holidays 2024: వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు.. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసొచ్చిన పండగ దినాలు
Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2023 | 7:03 AM

అమరావతి, డిసెంబర్‌ 1: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్ఛిక సెలవుల క్యాలెండర్‌-2024ను ప్రభుత్వం గురువారం (నవంబర్‌ 30) విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2024 సంవత్సరానికి గానూ 20 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐచ్ఛిక (ఆఫ్షనల్‌ హాలిడేస్‌) సెలవులు 17 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు ఐచ్చిక సెలవులను వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. చంద్ర దర్శనం బట్టి మారే రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్‌ ఉల్‌ నబీ వంటి పర్వదినాలతో పాటు తిధుల ప్రకారం మారే హిందూ పండుగల వివరాలను తరువాత ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో సాధారణ ఉత్తర్వులు వచ్చే వరకు ఆగకుండా ఆయా శాఖాధిపతులు తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

2024లో సాధారణ సెలవులు ఇవే…

  • సంక్రాంతి జనవరి 15 (సోమవారం)- 2024
  • కనుమ 16 (మంగళవారం)- 2024
  • రిపబ్లిక్‌ డే జనవరి 26 (శుక్రవారం)- 2024
  • మహాశివరాత్రి మార్చి 8 (శుక్రవారం)- 2024
  • హోలీ మార్చి 25 (సోమవారం)- 2024
  • గుడ్‌ ఫ్రైడే మార్చి 29 (శుక్రవారం)- 2024
  • బాబు జగ్జీవన్‌రామ్‌ జయంత్రి ఏప్రిల్‌ 5 (శుక్రవారం)- 2024
  • ఉగాది ఏప్రిల్‌ 9 (మంగళవారం)- 2024
  • రంజాన్‌ ఏప్రిల్‌ 11 (గురువారం)- 2024
  • శ్రీరామనవమి ఏప్రిల్‌ 17 (బుధవారం)- 2024
  • బక్రీద్‌ జూన్‌ 17 (సోమవారం)- 2024
  • మొహర్రం జూలై 17 (బుధవారం)- 2024
  • స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 (గురువారం)- 2024
  • శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 26 (సోమవారం)- 2024
  • వినాయకచవితి 7 సెప్టెంబరు (శనివారం)- 2024
  • ఈద్‌-మిలాద్‌-ఉన్‌-నబీ సెప్టెంబరు 16 (సోమవారం)- 2024
  • గాంధీ జయంతి అక్టోబరు 2 (బుధవారం)- 2024
  • దుర్గాష్టమి అక్టోబరు 11 (శుక్రవారం)- 2024
  • దీపావళి అక్టోబరు31 (గురువారం)- 2024
  • క్రిస్మస్‌ డిసెంబరు 25 (బుధవారం)- 2024

ఆదివారం, రెండో శనివారం వచ్చిన సాధారణ సెలవులు

  • భోగి జనవరి 14 (ఆదివారం)- 2024
  • డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14 (ఆదివారం)- 2024
  • విజయదశమి అక్టోబరు 12 (రెండో శనివారం)- 2024

ఆప్షనల్‌ హాలిడేస్‌ లిస్ట్

  • జనవరి 1 కొత్త సంవత్సరం (సోమవారం)- 2024
  • హజరత్‌ అలీ జయంతి జనవరి 25 (గురువారం)- 2024
  • షబ్‌-ఏ-మీరాజ్‌ ఫిబ్రవరి 7 (బుధవారం)- 2024
  • షహాదత్‌ హజ్రత్‌ అలీ ఏప్రిల్‌ 1 (సోమవారం)- 2024
  • జమాతుల్‌ విదా ఏప్రిల్‌ 5 (శుక్రవారం)- 2024
  • బసవ జయంతి మే 10 (శుక్రవారం)- 2024
  • బుద్ధ పూర్ణిమ మే 23 (గురువారం)- 2024
  • ఈద్‌-ఏ-ఘదిర్‌ జూన్‌ 25 (మంగళవారం)- 2024
  • మొహర్రం జూలై 16 (మంగళవారం)- 2024
  • పార్సీ న్యూ ఇయర్‌ డే ఆగస్టు 15 (గురువారం)- 2024
  • వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16 (శుక్రవారం)- 2024
  • మహాలయ అమావాస్య అక్టోబరు 2 (బుధవారం)- 2024
  • యాజ్‌ దహుమ్‌ షరీఫ్‌ అక్టోబరు 10 (గురువారం)- 2024
  • కార్తీక పూర్ణిమ, గురు నానక్‌ జయంతి నవంబరు 15 (శుక్రవారం)- 2024
  • హజరత్‌ సయ్యద్‌ మొహమ్మద్‌ జువాన్‌ పురి మహాది జయంతి నవంబరు 16 (శనివారం)- 2024
  • క్రిస్మస్‌ ఈవ్‌ డిసెంబరు 24 (మంగళవారం)- 2024
  • బాక్సింగ్‌ డే డిసెంబరు 26 (గురువారం)- 2024

ఆదివారాల్లో వచ్చిన ఆప్షనల్‌ హాలిడేస్‌ లిస్ట్…

  • షబ్‌-ఏ-బరాత్‌ ఫిబ్రవరి 25 (ఆదివారం) – 2024
  • షబ్‌-ఏ-ఖదర్‌ ఏప్రిల్‌ 7 (ఆదివారం)- 2024
  • మహావీర్‌ జయంతి ఏప్రిల్‌ 21 (ఆదివారం)- 2024
  • రథయాత్ర జూలై 7 (ఆదివారం)- 2024
  • అర్బయీన్‌ ఆగస్టు 25 (ఆదివారం)- 2024

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.