Tirupati: టీటీడీ శ్రీ ప‌ద్మావ‌తి చిన్నపిల్లల హృద‌యాల‌య‌కు రూ.1.51 కోట్ల విరాళం

తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి చిన్నపిల్లల ఆసుప‌త్రికి బెంగ‌ళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ రూ.1.51 కోట్ల విలువైన వైద్యప‌రిక‌రాల కొనుగోలుకు విరాళం అందించింది. ఈ మేర‌కు టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి సమ‌క్షంలో ఆ సంస్థ ప్రతినిధులు, ఆసుప‌త్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీ‌నాథ‌రెడ్డితో ఎంఓయు కుదుర్చుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి చిన్నపిల్లల హృద‌యాల‌య అద్భుత‌మైన సేవ‌లు అందిస్తోంద‌ని, ఎంతో మంది పేద‌లు మెరుగైన..

Tirupati: టీటీడీ శ్రీ ప‌ద్మావ‌తి చిన్నపిల్లల హృద‌యాల‌య‌కు రూ.1.51 కోట్ల విరాళం
Hal Donation To Hridayalaya
Follow us
Raju M P R

| Edited By: Srilakshmi C

Updated on: Dec 01, 2023 | 7:22 AM

తిరుప‌తి, డిసెంబర్‌ 1: తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి చిన్నపిల్లల ఆసుప‌త్రికి బెంగ‌ళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ రూ.1.51 కోట్ల విలువైన వైద్యప‌రిక‌రాల కొనుగోలుకు విరాళం అందించింది. ఈ మేర‌కు టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి సమ‌క్షంలో ఆ సంస్థ ప్రతినిధులు, ఆసుప‌త్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీ‌నాథ‌రెడ్డితో ఎంఓయు కుదుర్చుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి చిన్నపిల్లల హృద‌యాల‌య అద్భుత‌మైన సేవ‌లు అందిస్తోంద‌ని, ఎంతో మంది పేద‌లు మెరుగైన గుండె వైద్యసేవ‌లు పొందుతున్నార‌ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సిఎండి సీబీ అనంత‌కృష్ణన్‌ అన్నారు. ఎంతోమంది పేద‌లు మెరుగైన గుండె వైద్యసేవ‌లు పొందుతున్నార‌ని కొనియాడారు.

ఈ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన మూడు ఆప‌రేష‌న్ థియేట‌ర్ అన‌స్థీషియా వ‌ర్క్ స్టేష‌న్ వెంటిలేట‌ర్స్ విత్ మానిట‌ర్స్ కొనుగోలుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత‌గా విరాళం అందించిన‌ట్టు చెప్పారు. టీటీడీ జెఈవో స‌దా భార్గవి, సీవీఎస్వో న‌ర‌సింహ కిషోర్‌తోపాటు సంస్థ హెచ్ఆర్ డైరెక్టర్ ఏబీ ప్రధాన్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్ సౌమెన్ చౌద‌రిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం డిసెంబరు ఒక‌టో తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని టీటీడీ ఈ సందర్భంగా తెలిపింది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చన్నారు. భక్తులు 0877-2263261 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.