Gwalior Torso Case Solved: వీడిన మిస్టరీ.. తండ్రీకొడుకులే హంతకులు! హత్యచేసి 400 ముక్కలుగా నరికి
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఘోర ఘటన జరిగింది. తండ్రీకొడుకులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. అనంతరం మృతుడి శరీరాన్ని 400 ముక్కలుగా చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ముక్కలు చేసిన భాగాలను వివిధ ప్రాంతాల్లో విసిరేశారే. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య తరహాలో హంతకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గ్వాలియర్‌లోని కాలువలో మానవ మొండెం తేలుతూ కనిపించడంతో.. హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఆలస్యంగా వీరి దుర్మార్గం..
గ్వాలియర్, నవంబర్ 30: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఘోర ఘటన జరిగింది. తండ్రీకొడుకులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. అనంతరం మృతుడి శరీరాన్ని 400 ముక్కలుగా చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ముక్కలు చేసిన భాగాలను వివిధ ప్రాంతాల్లో విసిరేశారే. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య తరహాలో హంతకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గ్వాలియర్‌లోని కాలువలో మానవ మొండెం తేలుతూ కనిపించడంతో.. హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఆలస్యంగా వీరి దుర్మార్గం వెలుగులోకొచ్చింది. పోలీసు సూపరింటెండెంట్ షియాజ్ కెఎమ్ తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా బహదుర్‌పుర్ జనక్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో రాజుఖాన్‌కు వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తండ్రీకుమారులు కల్లుఖాన్, నజీంఖాన్‌లతో రాజుఖాన్ పాత గొడవలు ఉన్నాయి. గతంలో కల్లుఖాన్ వద్ద రాజుఖాన్ పనిచేసేవాడు. ఈ క్రమంలో రాజుఖాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. రాజుఖాన్‌ను రాజీ చేసుకోవాలని, తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయవల్సిందిగా తండ్రీకుమారులు కోరగా.. అతడు రూ.20 వేలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బు ఇచ్చే మిషతో రాజును సెప్టెంబర్ 21 ఇంటికి పిలిపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కల్లు, నజీమ్‌లు రాజును సత్యన్‌నారాయణ టేక్రిలోని మరో నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ డబ్బు విషయంలో రాజు, కల్లు మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ తర్వాత నజీమ్ రాజును ఇనుప డంబెల్‌తో కొట్టాడు. రాజు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, నజీమ్ అతనిని డంబెల్‌తో పదేపదే మోది హత్యచేశాడు. మృతదేహాన్ని దాచేందుకు, తండ్రీకొడుకులు దానిని అనేక ముక్కలుగా నరికివేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 400 ముక్కలుగా చేసి వాటిని 15-16 ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి, స్వర్ణ్ రేఖ డ్రెయిన్ వెంబడి ఉన్న వివిధ ప్రాంతాల్లో పడేశారు. మృతుడు రాజుఖాన్ సంఘటన జరిగిన రోజు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. తాము చేసిన నేరం ఎవరికీ తెలియదులే అని ఇద్దరూ అనుకున్నారు.
ఈ క్రమంలో గ్వాలియర్‌లోని జనక్‌గంజ్ ఠాణా పరిధి మురుగుకాలువలో సెప్టెంబరు 28న యువకుడి మొండెం దొరకడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలిసి కల్లుఖాన్, నజీంఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల అనుమానం మరింత బలపడి తండ్రీకుమారులను ఇటీవల అరెస్టు చేశారు. నేరం జరిగిన 57 రోజుల తర్వాత డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నజీమ్ తండ్రి కల్లు ఖాన్ మంగళవారం అరెస్టు చేయడంతో హత్య మిస్టరీ వీడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.