Headache: 5 నెలలుగా తలనొప్పి.. డాక్టర్ల వద్దకు వెళ్లిన రోగి! సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి నోరెళ్ల బెట్టిన డాక్టర్లు..
తలనొప్పి ఒక సాధారణ సమస్య. తలనొప్పి విపరీతంగా ఉంటే షాపుల్లో మందులు తెచ్చుకుని వేసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే ఓ వ్యక్తికి మాత్రం 5 నెలల నుంచి తలనొప్పి తగ్గడం లేదు. మొదట్లో చిన్నపాటి తలనొప్పిగా భావించి పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వైద్యుల వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతని తలలో ఉన్న వింత వస్తువును చూసి షాక్‌కు గురయ్యారు. ఈ విచిత్ర ఘటన వియత్నాంలో వెలుగు చూసింది. అసలింతకీ అతని తలలో..
వియత్నం, నవంబర్ 29: తలనొప్పి ఒక సాధారణ సమస్య. తలనొప్పి విపరీతంగా ఉంటే షాపుల్లో మందులు తెచ్చుకుని వేసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే ఓ వ్యక్తికి మాత్రం 5 నెలల నుంచి తలనొప్పి తగ్గడం లేదు. మొదట్లో చిన్నపాటి తలనొప్పిగా భావించి పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వైద్యుల వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతని తలలో ఉన్న వింత వస్తువును చూసి షాక్‌కు గురయ్యారు. ఈ విచిత్ర ఘటన వియత్నాంలో వెలుగు చూసింది. అసలింతకీ అతని తలలో ఏం ఉందంటే..
వియత్నాంకి చెందిన ఓ వ్యక్తి గత ఐదు నెలలుగా తలనొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. దీనితోపాటు అతని కంటి చూపు క్రమంగా తగ్గిపోవడం ప్రారంభించింది. ముక్కు నుంచి కూడా వింత నీరు బయటకు రావడం గమనించాడు. దీంతో అతను వైద్యుల వద్దకు వెళ్ళాడు. వైద్యులు మొదట అతడిని పరీక్షించి, ఈ సమస్యల వెనుక అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారికి సమస్య ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదు. దీంతో వైద్యులు అతనికి CT స్కాన్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. సీటీ స్కాన్‌లో అతని ముక్కులో రెండు చాప్‌స్టిక్‌లు ఇరుక్కుపోయి ఉండటం గమనించిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ ముక్కలు అతని మెదడు వరకు ఉండటం వైద్యులు గమనించారు. వెంటనే వైద్యులు శస్త్రచికిత్స చేసి చాప్ స్టిక్స్‌ను తొలగించారు. వియత్నాంలోని డాంగ్ హోయ్‌లోని క్యూబా ఫ్రెండ్‌షిప్ హాస్పిటల్ వైద్యులు ఆ వ్యక్తికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత అతని ముక్కు నుంచి రెండు చాప్‌స్టిక్‌లను బయటకు తీశారు.
చాప్ స్టిక్ ముక్కులోకి ఎలా ప్రవేశించాయంటే..
న్యూయార్క్ పోస్ట్ నివేదిక అందించిన సమాచారం మేరకు.. సదరు వ్యక్తి కొన్ని నెలల క్రితం కొంతమందితో గొడవపడ్డాట్లు వైద్యులకు చెప్పాడు. అప్పుడు మద్యం సేవించి ఉండటం వల్ల మత్తులో ఉన్నానని, వారు అతనిని తీవ్రంగా కొట్టారని తెలిపారు. ఆ సమయంలో తన నోట్లో వాళ్లు ఎదో గుచ్చుకున్నారని తెలుసుకున్నాడు గానీ మద్యం మత్తు కారణంగా అదేంటో స్పష్టం అతనికి తెలియరాలేదన్నాడు. గాయాల పాలైన అతను ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ వైద్యులు డ్రెస్సింగ్ చేసిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారని అతను వైద్యులకు తెలిపాడు. ఆ రోజు వాళ్లు తన ముక్కులో గుచ్చింది చాప్ స్టిక్స్ అని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాడు. న్యూరోసర్జరీ విభాగం అధిపతి డాక్టర్ న్గుయెన్ వాన్ మ్యాన్ మాట్లాడుతూ.. ఇది చాలా అరుదైనది సంఘటనగా పేర్కొన్నారు. ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా చాప్‌స్టిక్‌లను తొలగించగలగామన్నారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం అతను పూర్తిగా కోలుకున్నాడని, అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయన తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.