AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook Friend: ఫేస్‌బుక్‌ ప్రియుడ్ని పెళ్లాడేందుకు పాక్‌కు వెళ్లిన అంజూ.. పిల్లలు గుర్తొస్తున్నారంటూ భారత్‌కు తిరిగొచ్చిన వైనం

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడే రెండోపెళ్లి చేసుకున్న రాజస్థాన్‌ యువతి తిరిగి భారత్‌కు వచ్చింది. అట్టారి వాఘా బోర్డర్‌ నుంచి ఆమె భారత్‌లోకి బుధవారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) పాక్‌కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది. నస్రుల్లా బుధవారం (నవంబర్‌ 29) సరిహద్దుదాకా ఆమె

Facebook Friend: ఫేస్‌బుక్‌ ప్రియుడ్ని పెళ్లాడేందుకు పాక్‌కు వెళ్లిన అంజూ.. పిల్లలు గుర్తొస్తున్నారంటూ భారత్‌కు తిరిగొచ్చిన వైనం
Facebook Love Story
Srilakshmi C
|

Updated on: Nov 30, 2023 | 7:12 AM

Share

న్యూఢిల్లీ, నవంబర్‌ 30: ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడే రెండోపెళ్లి చేసుకున్న రాజస్థాన్‌ యువతి తిరిగి భారత్‌కు వచ్చింది. అట్టారి వాఘా బోర్డర్‌ నుంచి ఆమె భారత్‌లోకి బుధవారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) పాక్‌కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది. నస్రుల్లా బుధవారం (నవంబర్‌ 29) సరిహద్దుదాకా ఆమె వెంట వచ్చి భారత్‌లోకి సాగనంపాడు.

రాజస్థాన్‌లోని భీవాడీకి చెందిన అంజూకు అప్పటికే వివాహమై 15 ఏళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. 2019లో ఆమె నస్రుల్లా అనే పాకిస్థాన్‌ యువకుడిని ఫేస్‌బుక్‌ ద్వారా కలిసింది. అనంతరం వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది జూన్‌లో తన కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమె నస్రూన్‌ను కలిసేందుకు పాక్‌కి వెళ్లింది. అయితే తన భర్తకు మాత్రం జైపూర్‌ వెళ్తున్నట్లు చెప్పింది. తీరా చూస్తే ఆమె పాక్‌లో ప్రత్యక్షమైంది. పాక్‌లో అంజూ తన ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకునేందుకు ఇస్లాం మతాన్ని స్వీకరించింది. పాక్‌లో అతన్ని పెళ్లి చేసుకున్నాక ఆమె పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఆమె నిర్వాకంతో భారత్‌లోని కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ నేపథ్యంలో నస్రుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అంజూ తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పాడు. ఆమె మానసిక వేదనతో బాధపడుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు అతడు వెల్లడించాడు. ఆమె పిల్లలను కలిసేందుకు భారత్‌లోని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంజూ వెంటన తాను కూడా భారత్‌కు వచ్చేందుకు సిద్ధపడ్డానన్నాడు. అయితే వీసా విషయంలో ఇబ్బంది కారణంగా రాలేకపోయినట్లు తెలిపాడు. అంజూ మొదటి భర్తా అరవింద్‌ భివాడి ఆమెపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అంజూపై ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం అరవింద్‌ తన పిల్లలతో ఎక్కడ నివసిస్తున్నాడనేది స్పష్టంగా తెలియరాలేదు.

అయినప్పటికీ భారత్‌కు ఎందుకు తిరిగి వచ్చావని వాఘా వద్ద మీడియా అడిగిన ప్రశ్నకు అంజూ సమాధానం ఇస్తూ ‘నేను సంతోషంగా ఉన్నాను. చెప్పడానికి ఏమీ లేదు. నా కుటుంబాన్ని కలిసేందుకు ఇష్టప్రకారమే భారత్‌కు వచ్చాను’ అంటూ ముఖానికి మాస్క్‌ ధరించి వేగంగా వెళ్లిపోయింది. కాగా ఇప్పటి వరకూ ఆమె రాజస్థాన్‌లోని తన ఇంటికి చేరుకోలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్