Tirupati: శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో డిసెంబరు నెలలో జరనున్న ప్రత్యేక ఉత్సవాలు ఇవే..
తిరుమల తిరుపతి దేవస్తానం స్థానికాలయాల్లో డిసెంబరు నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. డిసెంబరు 10న శ్రీ గోవిందరాజస్వామివారు తిరువడి సన్నిధికి వేంచేయనున్నారు. 11న శ్రీ కపిలేశ్వరాలయంలో సోమవారాభిషేకం జరగనుంది. డిసెంబరు 17న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు ఇతర ఆలయాల్లో ధనుర్మాసం ప్రారంభం కానుంది. డిసెంబరు 22 నుండి 26 వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు..
తిరుపతి, డిసెంబర్ 1: తిరుమల తిరుపతి దేవస్తానం స్థానికాలయాల్లో డిసెంబరు నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. డిసెంబరు 10న శ్రీ గోవిందరాజస్వామివారు తిరువడి సన్నిధికి వేంచేయనున్నారు. ఇక డిసెంబర్ 11న శ్రీ కపిలేశ్వరాలయంలో సోమవారాభిషేకం జరగనుంది. డిసెంబరు 17న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు ఇతర ఆలయాల్లో ధనుర్మాసం ప్రారంభం కానుంది. డిసెంబరు 22 నుండి 26 వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇక డిసెంబరు 23న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి, 27న శ్రీ కపిలేశ్వరాలయంలో ఆరుద్ర దర్శన మహోత్సవాన్ని టీటీడీ నిర్వహించనుంది. వీటితోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది. ఆ వివరాలు మీకోసం..
డిసెంబరు నెలలో టీటీడీ స్థానికాలయాల్లో జరిగే ఉత్సవాలు ఇవే..
- డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం, డిసెంబరు 8న సర్వ ఏకాదశి జరగనుంది.
- డిసెంబరు 12న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా 17న ధనుర్మాసం ఆరంభం కానుంది.
- ఇక డిసెంబరు 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర జరగనుంది.
- డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి రావడంతో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. అదే రోజు స్వర్ణరథోత్సవం జరగనుంది.
- డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారి చక్రస్నానం. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి జరగనుంది.
- డిసెంబరు 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.