Guwahati: ప్రియుడి ఫ్లాట్‌లో యువతి అనుమానాస్పద మృతి! పోలీసుల అదుపులో ప్రియుడు

అస్సాంలోని గౌహతిలోని ఓ ఫ్లాట్‌లో యువతి మృతి చెందినట్లు హతిగావ్ పోలీసులు గురువారం (నవంబర్‌ 30) గుర్తించారు. గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలోని రాజ్‌పాత్‌లోని కాసా లిమిటాడో అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మహిళ మృతి చెందింది. మృతురాలిని మేఘాలయకు చెందిన రితికా సోనార్‌గా గుర్తించారు. మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూపేష్ రాయ్ అనే యువకుడితో చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అపార్ట్‌మెంట్‌లోని..

Guwahati: ప్రియుడి ఫ్లాట్‌లో యువతి అనుమానాస్పద మృతి! పోలీసుల అదుపులో ప్రియుడు
Guwahati Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2023 | 11:55 AM

గౌహతి, డిసెంబర్‌ 1: అస్సాంలోని గౌహతిలోని ఓ ఫ్లాట్‌లో యువతి మృతి చెందినట్లు హతిగావ్ పోలీసులు గురువారం (నవంబర్‌ 30) గుర్తించారు. గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలోని రాజ్‌పాత్‌లోని కాసా లిమిటాడో అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మహిళ మృతి చెందింది. మృతురాలిని మేఘాలయకు చెందిన రితికా సోనార్‌గా గుర్తించారు. మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూపేష్ రాయ్ అనే యువకుడితో చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో నివసిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

బుధవారం రాత్రి ఈ జంట గొడవపడ్డారు. ఆ తర్వాత రితికా సోనార్ తన గది తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకూ ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో రూపేష్ గది తలుపులు పగులగొట్టాడు. అనంతరం గదిలోకి ప్రవేశించి చూడగా రితికా సోనార్ అపస్మారక స్థితిలో కనిపించింది. అనంతరం గౌహతి మెడికల్ కాలేజీకి హుటాహుటీన తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న హతిగావ్ పోలీసులు గురువారం తెల్లవారుజామున సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రియుడు రూపేష్ రాయ్‌ను విచారణ నిమిత్తం హతిగావ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నవంబర్‌ నెలలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. మొదటి సంఘటన సిక్స్ మైల్ వద్ద జరిగింది. ఇక్కడ చోంగజాన్‌కు చెందిన అంజు దోర్జీ అనే మహిళ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రెండవ సంఘటనలో ధేమాజీకి చెందిన యువతి అనుష్క సైకియా. నగరంలో యువతుల మృతి కేసులు వరుసగా నమోదవుతుండటంలో పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!