Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: ఉలిక్కపడిన బెంగళూరు.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Bengaluru schools get bomb threat: బెంగళూరులో స్కూల్స్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నగరంలోకి 15 ప్రముఖ స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. ఈ ఉదయం స్కూల్స్‌ ప్రారంభమైన తర్వాత సిబ్బంది తమ మెయిల్స్‌ యాక్సెస్‌ చేసినప్పుడు అందులో స్కూల్‌లో బాంబులు పెట్టినట్టు హెచ్చరిక మెసేజ్‌ కనిపించింది.

Bengaluru: ఉలిక్కపడిన బెంగళూరు.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Dk Shivakumar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2023 | 11:48 AM

Bengaluru schools get bomb threat: బెంగళూరులో స్కూల్స్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నగరంలోకి 15 ప్రముఖ స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. ఈ ఉదయం స్కూల్స్‌ ప్రారంభమైన తర్వాత సిబ్బంది తమ మెయిల్స్‌ యాక్సెస్‌ చేసినప్పుడు అందులో స్కూల్‌లో బాంబులు పెట్టినట్టు హెచ్చరిక మెసేజ్‌ కనిపించింది. దీంతో అలర్ట్‌ అయిన స్కూల్స్‌ యాజమాన్యాలు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం పంపించి విద్యార్థులను ఇళ్లకు పంపించాయి. బాంబులు పెట్టారనే విషయం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లారు. వెంటనే స్కూల్స్‌కు చేరుకొని తమ పిల్లలు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించారు. పిల్లలంతా క్షేమంగా బయటకు వచ్చేంత వరకు అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. బసవేశ్వర నగర్‌, సదాశివనగర్‌ ప్రాంతాల్లోని స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి.

మరోవైపు బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీసులు సూచించారు. ఇవి తప్పుడు ఈమెయిల్స్‌ కావచ్చని అనుమానిస్తున్నారు. ఆ ఈమెయిల్స్‌ ఎవరు పంపించారనే దాన్ని ఆరా తీస్తున్నారు. కర్నాటక హోంమంత్రి DK శివకుమార్‌ తన ఇంటి సమీపంలోని నీవ్‌ అకాడమీ స్కూల్‌ను సందర్శించారు. ఇవి ఉత్తుత్తి ఈమెయిల్స్ అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఈమెయిల్‌ పంపిన వారిని 24 గంటల్లో అదుపులోకి తీసుకుంటామని ప్రకటించారు.

వాస్తవానికి ఈ తరహా బెదిరింపు ఈమెయిల్స్‌ గతేడాది డిసెంబర్‌ ఒకటో తేదీన కూడా చాలా స్కూల్స్‌కు వచ్చాయి. అప్పుడు ఏకంగా 30 స్కూల్స్‌కు అలాంటి బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. కాని అవన్నీ ఉత్తుత్తివేనని తర్వాత తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..