India vs Newzealand: టీమిండియా రాక్స్.. హాట్‌స్టార్ షేక్స్ .. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు..

డేటా ప్రకారం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో మ్యాచ్ వీక్షించే వారి సంఖ్య 53 మిలియన్లకు చేరుకుంది. అంటే 5.3 కోట్లకు చేరుకుంది. నవంబర్ 5న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ని వీక్షించిన వారి సంఖ్య 4.4 కోట్లు ఉండగా తాజాగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌తో సరికొత్త రికార్డు నమోదైంది. అంతేకాదు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రికార్డు బద్దలైంది.

India vs Newzealand: టీమిండియా రాక్స్.. హాట్‌స్టార్ షేక్స్ .. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు..
Disney+ Hotstar
Follow us

|

Updated on: Nov 16, 2023 | 12:05 PM

భారతదేశంలో మూడో సారి క్రికెట్ లో ప్రపంచ విజేతగా సగర్వంగా నిలబడడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ముంబైలోని చారిత్రాత్మక మైదానం వాంఖడేలో సెమిస్ లో న్యూజిలాండ్ ను ఓడించిన భారత్ ఫైనల్ లో అడుగు పెట్టింది. అంతేకాదు ఈ స్టేడియం అనేక రికార్డ్స్ కు వేదికగా నిలిచింది. విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించారు. మరోవైపు 10 రోజుల్లో డిస్నీ హాట్‌స్టార్ తన పేరిట మరో కొత్త రికార్డును కూడా సృష్టించింది. అంతే కాదు మైదానంలో విరాట్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి పరుగుల వరద పారించారు. అదేవిధంగా డిస్నీ హాట్‌స్టార్‌పై కూడా కాసుల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో సాధించిన రికార్డు కారణంగా డిస్నీ హాట్‌స్టార్ రూ.41 వేల కోట్ల లాభాలను ఆర్జించింది. డిస్నీ హాట్‌స్టార్ ఏ విధంగా రికార్డ్ సృష్టించిందో..  కంపెనీ రూ. 41 వేల కోట్లకు పైగా ఎలా సంపాదించిందో తెలుసుకుందాం..

డిస్నీ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌..  నవంబర్ 15న కొత్త గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్ లో వీక్షకుల రికార్డును నెలకొల్పింది. 10 రోజుల క్రితం భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో  నమోదైన రికార్డ్ ను నిన్న జరిగిన సెమీ ఫైనల్స్ బీట్ చేసింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక సాధారణ అంశం కామన్ గా ఒక విషయం కనిపిస్తోంది. అదే విరాట్ కోహ్లీ సెంచరీ. నవంబర్ 5న కోల్‌కతాలోని జాయ్ సిటీలోని ఈడెన్ గార్డెన్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అప్పుడు ఆ సెంచరీతో వన్డేల్లో సచిన్ రికార్డ్ 49 సెంచరీలను సమం చేశాడు. నవంబర్ 15న  వాంఖడే మైదానంలో, విరాట్ న్యూజిలాండ్‌పై తన 50వ సెంచరీని సాధించాడు. దీంతో సచిన్ రికార్డ్ ను బీట్ చేసి ODIలలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ గా విరాట్ రికార్డును సృష్టించాడు.

డేటా ప్రకారం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో మ్యాచ్ వీక్షించే వారి సంఖ్య 53 మిలియన్లకు చేరుకుంది. అంటే 5.3 కోట్లకు చేరుకుంది. నవంబర్ 5న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ని వీక్షించిన వారి సంఖ్య 4.4 కోట్లు ఉండగా తాజాగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌తో సరికొత్త రికార్డు నమోదైంది. అంతేకాదు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రికార్డు బద్దలైంది. లైవ్ స్ట్రీమింగ్ లో భారత దేశంలో ప్రస్తుత మార్కెట్ లీడర్ అయిన డిస్నీ+ హాట్‌స్టార్ గత నెల రోజులుగా తన రికార్డులను తానే బద్దలు కొడుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

కంపెనీ షేర్లలో పెరుగుదల

రికార్డు వీక్షకుల సంఖ్య కారణంగా డిస్నీ షేర్ల ధర కూడా పెరిగింది. బుధవారం ఈ షేరు 3 శాతానికి పైగా లాభంతో ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు కూడా దాదాపు 4 శాతం వృద్ధితో 94.57 డాలర్లకు చేరుకున్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం కంపెనీ షేర్లు 3.14 శాతం పెరుగుదలతో $93.93 వద్ద ముగిశాయి. విశేషమేమిటంటే క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి డిస్నీ షేర్ల ధర 19 శాతానికి పైగా పెరిగాయి. అక్టోబర్ 4న కంపెనీ షేర్ల ధర 80 డాలర్లు కూడా లేదు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ కారణంగా డిస్నీ హాట్‌స్టార్‌కు విపరీతమైన లబ్ధి చేకూరిందని స్పష్టమవుతోంది.

కొన్ని గంటల్లో రూ.41 వేల కోట్ల లాభం

డిస్నీ షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. కొన్ని గంటల్లో ఈ కంపెనీ mcap 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెరిగింది. గణాంకాలోకి వెళ్తే.. ఒక రోజు క్రితం కంపెనీ మార్కెట్ క్యాప్ 162.195 బిలియన్ డాలర్లు ఉంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బుధవారం ముగిసినప్పుడు, కంపెనీ మార్కెట్ క్యాప్ $167.289 బిలియన్లుగా ఉంది. అంటే భారతీయ రూపాయలలో కంపెనీ రూ.41 వేల కోట్లకు పైగా లాభం ఆర్జించింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే