Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘శోభ, ప్రియాంక నా భర్తను చిన్న చూపు చూశారు.. చాలా బాధేసింది’.. భోలే భార్య ఎమోషనల్‌

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ సింగర్‌ భోలే షావలి బయటకు వచ్చాడు. వైల్డ్‌ కార్డ్‌తో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సీరియల్‌ బ్యాచ్‌కు తన మాటలు, పాటలతో పట్ట పగలే చుక్కులు చూపించాడు. ఇక నామినేషన్స్‌ వచ్చినప్పుడల్లా శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, భోలేల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది.

Bigg Boss 7 Telugu: 'శోభ, ప్రియాంక నా భర్తను చిన్న చూపు చూశారు.. చాలా బాధేసింది'.. భోలే భార్య ఎమోషనల్‌
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2023 | 10:02 AM

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ సింగర్‌ భోలే షావలి బయటకు వచ్చాడు. వైల్డ్‌ కార్డ్‌తో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సీరియల్‌ బ్యాచ్‌కు తన మాటలు, పాటలతో పట్ట పగలే చుక్కులు చూపించాడు. ఇక నామినేషన్స్‌ వచ్చినప్పుడల్లా శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, భోలేల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ముగ్గురి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ నేపథ్యంలో శోభా, ప్రియాంక జైన్‌ భోలే షావలిని చిన్న చూపు చూశారంటూ అతని భార్య సీమ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవలే ఎలిమినేట్‌ అయ్యి వచ్చిన భోలే గురించి, హౌజ్‌లో అతని ఆటతీరు గురించి సీమ స్పందించింది. ఇందులో భాగంగా గ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు భోలేతో శోభ, ప్రియాంకల గొడవల విషయాన్ని కూడా ప్రస్తావించింది. ‘ నా భర్త (భోలే) ఎవరేమన్నా పెద్దగా పట్టించుకునే రకం కాదు. ఏదైనా పాట రూపంలోనే రియాక్ట్‌ అవ్వడం ఆయనకు అలవాటు. నా భర్త బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు శోభ దారుణంగా మాట్లాడింది. భోలేను తక్కువ చేసి చూసింది. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో నా భర్త బట్టల గురించి శోభ నోటికొచ్చినట్లు మాట్లాడింది. నీ బట్టలు చూస్తేనే నీ గురించి అర్థమవుతుందని కామెంట్స్‌ చేసింది. ఇక ప్రియాంక అయితే ‘థూ’ అని కూడా అనేసింది. ఆ రోజు వాళ్ల మాటలు విని మేమంతా చాలా బాధపడ్డాం’ అని ఎమోషనల్‌ అయ్యింది భోలే భార్య.

‘శోభ, ప్రియాంకలు అన్ని మాటలన్నా నా భర్త సహనంగానే ఉన్నాడు. అదే రోజు రాత్రి వెళ్లి వాళ్లకు సారీ చెప్పాడు. ‘సారీ అమ్మా .. క్షమించమ్మా’ అని అడిగాడు. అయినా శోభా తీసుకోలేదు. ‘నీ క్షమాపణలు ఎవరికీ కావాలి? నువ్వెవరికి కావాలి? నిన్ను చూస్తుంటేనే చిరాకేస్తుంది’ అని దారుణంగా మాట్లాడింది. ఏదో ఒక కారణం చెబుతూ ప్రతిసారి మా ఆయనను నామినేట్‌ చేసింది. శోభ, ప్రియాంకలు వ్యవహరించిన తీరు దారుణం. వారిద్దరికి అహంకారమెక్కువ’ అంటూ చెప్పుకొచ్చింది సీమ.

ఇవి కూడా చదవండి

 భార్యతో కలిసి భోలే షా వలి ఇంటికెళ్లిన సందీప్ మాస్టర్..

హౌజ్ లో భోలే షావలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.