AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odiyan OTT: ఓటీటీలోకి మరో మలయాళ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌కు మోహన్ లాల్‌ ఓడియన్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ఓటీటీ సంస్థలు గతంలో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన పలు మలయాళం మూవీస్‌ను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆడియెన్స్‌ సులభంగా అర్థం చేసుకునేలా తెలుగు డబ్బింగ్‌ చేసి మరీ తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు మరో మలయాళ సినిమా తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి రానుంది.

Odiyan OTT: ఓటీటీలోకి మరో మలయాళ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌కు మోహన్ లాల్‌ ఓడియన్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
Odiyan Movie
Basha Shek
|

Updated on: Nov 15, 2023 | 12:10 PM

Share

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ఓటీటీ సంస్థలు గతంలో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన పలు మలయాళం మూవీస్‌ను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆడియెన్స్‌ సులభంగా అర్థం చేసుకునేలా తెలుగు డబ్బింగ్‌ చేసి మరీ తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు మరో మలయాళ సినిమా తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి రానుంది. అదే 2018లో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ఓడియన్‌. వీఏ శ్రీకుమార్‌ తెరకెక్కించిన ఈ ఫాంటసీ డ్రామాలో మంజు వారియర్‌, ప్రకాశ్‌ రాజ్‌, సిద్ధిఖీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్‌ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్‌ బాహుబలి తరహాలో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఓడియన్‌ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా కోసం మోహన్ లాల్ తన శరీరాన్ని పూర్తిగా 35 ఏళ్ల వ్యక్తిగా మార్చుకున్నాడు. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఓడియన్‌ వాటిని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే హీరో మోహన్‌లాల్‌ అభిమానులకు మాత్రం ఓడియన్‌ మూవీ ఒక ఐ ఫీస్ట్‌లా నిలిచింది. సినిమాలో సూపర్‌ స్టార్‌ వేసిన యోగాసనాలు, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే థియేటర్లలో విడుదలైన సుమారు ఆరేళ్ల తర్వాత ఓడియన్‌ తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో నవంబర్‌ 24 నుంచి ఓడియన్‌ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్‌. ‘అటెన్షన్‌.. అటెన్షన్‌.. మీ క్యాలెండర్‌ లో నవంబర్‌ 24వ తేదీని మార్క్‌ చేసుకోండి. ఆరోజే మన మోహన్‌లాల్‌ ఓడియన్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కు రానుంది. గెట్‌ రెడీ ‘అని సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను పంచుకుంది.

థియేటర్లలో విడుదలైన ఆరేళ్లకు..

లూసిఫర్ 2 నుంచి క్రేజీ అప్డేట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమెరికా ఒత్తిళ్లు.. ఇరాన్ కృతజ్ఞతలు.. ఇజ్రాయెల్ ప్రశంసలు.. 
అమెరికా ఒత్తిళ్లు.. ఇరాన్ కృతజ్ఞతలు.. ఇజ్రాయెల్ ప్రశంసలు.. 
కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన..
కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన..
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే.. తారక్ ఆన్సర్ ఇదే.
తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే.. తారక్ ఆన్సర్ ఇదే.
Viral Video: గుండె గట్టిగా ఉన్నోళ్లే ఈ వీడియో చూడండి..
Viral Video: గుండె గట్టిగా ఉన్నోళ్లే ఈ వీడియో చూడండి..