Chiranjeevi: ‘బాసూ.. అదిరింది గ్రేసు’.. షారుక్‌ జవాన్‌ పాటకు చిరంజీవి డ్యాన్స్‌.. వీడియో చూశారా?

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మనవరాలు క్లింకార కొణిదెల పుట్టాక వచ్చాక మొదటి దీపావళి కావడంతో గ్రాండ్‌గా దీపావళి సెలబ్రేట్‌ చేశారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీ, మంచు లక్ష్మీ తదితరులు సతీసమేతంగా ఈ వేడుకల్లో సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు,

Chiranjeevi: ‘బాసూ.. అదిరింది గ్రేసు’.. షారుక్‌ జవాన్‌ పాటకు చిరంజీవి డ్యాన్స్‌.. వీడియో చూశారా?
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Nov 14, 2023 | 9:06 PM

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మనవరాలు క్లింకార కొణిదెల పుట్టాక వచ్చాక మొదటి దీపావళి కావడంతో గ్రాండ్‌గా దీపావళి సెలబ్రేట్‌ చేశారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీ, మంచు లక్ష్మీ తదితరులు సతీసమేతంగా ఈ వేడుకల్లో సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా ఇదే వేడుకల్లో మెగాస్టార్‌ చిరంజీవి సూపర్బ్‌ స్టెప్పులేసి ఆహుతులను అలరించారు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ నటించిన జవాన్ టైటిల్‌ సాంగ్‌కు తన దైన స్టైల్‌లో డ్యాన్స్‌ వేశారు మెగాస్టార్‌. ప్రముఖ సింగర్‌ రాజకుమారి ‘జవాన్’ పాటను ఆలపిస్తుండగా చిరంజీవి తనదైన గ్రేస్‌తో డ్యాన్స్‌ చేశారు. ఇక హీరో రామ్‌ చరణ్‌ దగ్గరుండి మరీ తన తండ్రిని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ‘బాసూ.. అదిరింది మీ గ్రేసు..’ అంటూ అభిమాన్లు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టారు చిరంజీవి. అయితే భోళాశంకర్‌గా మెప్పించలేకపోయారు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. దీనికి విశ్వంభర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని అప్‌ డేట్స్‌ రానున్నాయి.

చిరంజీవి డ్యాన్స్.. వీడియో

జత కలిసిన రామ్ చరణ్..

బాసూ.. ఎప్పటికీ అదే గ్రేసూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే