Kannur Squad OTT: అఫీషియల్.. ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

కథ ఎంతో ఆసక్తిగా ఉండడంతో హీరో మమ్ముట్టినే స్వయంగా కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమాను నిర్మించడం విశేషం. ఆయన అంచనాలకు తగ్గట్టే సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ మలయాళ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను..

Kannur Squad OTT: అఫీషియల్.. ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Kannur Squad Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 10, 2023 | 8:28 PM

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించిన లేటెస్ట్‌ సినిమా కన్నూర్‌ స్క్వాడ్‌. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ స్టోరీతో కూడిన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సెప్టెంబర్‌ 28న థియేటర్లలో విడుదలైన కన్నూర్‌ స్వ్కాడ్‌ బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. కేవలం రూ. 25 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కథ ఎంతో ఆసక్తిగా ఉండడంతో హీరో మమ్ముట్టినే స్వయంగా కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమాను నిర్మించడం విశేషం. ఆయన అంచనాలకు తగ్గట్టే సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ మలయాళ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 17 నుంచి మమ్ముట్టి సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ మమ్ముట్టి సినిమనాఉ స్ట్రీమింగ్‌కు రానుంది.

ఖాకీ సినిమా తరహాలో..

కాగా యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని వ‌ర్గీస్ రాజ్ కన్నూర్‌ స్క్వాడ్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఓ బిజినెస్ మ్యాన్‌ హత్య కేసును ఛేదించేందుకు క‌న్నూర్ స్క్వాడ్ అనే స్పెష‌ల్ పోలీస్ టీమ్ ఏర్పాటుచేస్తుంది ప్రభుత్వం. ఈ పోలీస్‌ టీమ్‌కు హెడ్‌గా జార్జ్‌ (మమ్ముట్టి) వ్యవహరిస్తాడు. మరి జార్జ్‌ తన తెలివితేటలతో హంతకులను ఎలా పట్టుకున్నాడన్నదే క‌న్నూర్ స్క్వాడ్ మూవీ క‌థ‌. కాగా గతంలో కార్తీ నటించిన ఖాకీ సినిమా ఛాయలు కన్నూర్‌ స్క్వాడ్‌ లో ఉన్నాయని టాక్‌ వచ్చింది. అయితే టేకింగ్‌లో చాలా డిఫరెంట్ ఉందని కామెంట్స్‌ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

వంద కోట్ల వసూళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే