AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఈ కన్నీళ్లకు బదులు తీర్చుకుంటారా? భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?

సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు తలపడ్డాయి. లీగ్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌ చేరిన టీమిండియా కివీస్‌ ముందు బోల్తాపడింది. న్యూజిలాండ్‌ విధించిన 240 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 221 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయి కోహ్లీ సేన ఇంటిదారిపట్టింది

IND vs NZ: ఈ కన్నీళ్లకు బదులు తీర్చుకుంటారా?  భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Team India
Basha Shek
|

Updated on: Nov 15, 2023 | 6:13 AM

Share

సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు తలపడ్డాయి. లీగ్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌ చేరిన టీమిండియా కివీస్‌ ముందు బోల్తాపడింది. న్యూజిలాండ్‌ విధించిన 240 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 221 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయి కోహ్లీ సేన ఇంటిదారిపట్టింది. 72 బంతుల్లో 50 పరుగులు చేసిన ధోని అనూహ్యంగా రనౌట్‌ కావడం మ్యాచ్‌లో కీలక మలుపు. టీమిండియా ఓడిపోవడంతో ధోని, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా టీమిండియా క్రికెటర్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక కోట్లాది మంది భారత అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడీ కన్నీళ్లకు బదులు తీర్చుకునే అవకాశం భారత జట్టుకు వచ్చింది. ప్రపంచ కప్‌-2023లో భాగంగా సెమీస్‌ పోరులో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్‌ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక వన్డే ప్రపంచకప్ సిరీస్‌లో ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి . భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు దాదాపుగా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌ జట్లు సెమీస్ రేసులో ఉన్నా నాకౌట్‌కు చేరుకోవడం కష్టం. పాక్‌ సెమీస్‌ చేరాలంటే సుమారు 250 నుంచి 300 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించాలి. అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి సెమీ ఫైనల్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. కాబట్టి ఆ ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు టీమ్ ఇండియాకు వచ్చింది.

భారత్ వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది. 2011లో మనకు ప్రపంచ కప్‌ అందించిన ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు వేదిక కానుంది. లీగ్‌ దశలో భారత్‌ న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే నాకౌట్‌ బలహీనత టీమిండియాను వేధిస్తోంది. మరి ఈ ఒత్తిడిని అధిగమించి రోహిత్ సేన న్యూజిలాండ్‌ను ఓడించాలంటే బాగా శ్రమించాల్సిందే. ఇక రెండో సెమీఫైనల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు 1999 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. అందుకే చాలా ఏళ్ల తర్వాత ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్షిణాఫ్రికాకు దక్కింది.

ఇవి కూడా చదవండి

నాకౌట్ బలహీనతను అధిగమించాల్సిందే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..