World Cup 2023: టీమిండియాపై ఛీటింగ్ ఆరోపణలు.. ఫాల్తూ, బక్వాస్ మాటలొద్దంటూ పాక్ క్రికెటర్‌పై షమీ ఫైర్
ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్రను ఓర్చుకోలేని పాక్ మాజీ క్రికెటర్ హసన్ రాజా కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లంక, దక్షిణాఫ్రికాలను టీమిండియా బౌలర్లు తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంపై ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడిన ఆయన ఐసీసీ, బీసీసీఐ, భారత బౌలర్లు కలిసి కుట్రపన్నుతున్నారంటూ సంచలన కామెంట్లు చేశాడు.
ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్రను ఓర్చుకోలేని పాక్ మాజీ క్రికెటర్ హసన్ రాజా కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లంక, దక్షిణాఫ్రికాలను టీమిండియా బౌలర్లు తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంపై ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడిన ఆయన ఐసీసీ, బీసీసీఐ, భారత బౌలర్లు కలిసి కుట్రపన్నుతున్నారంటూ సంచలన కామెంట్లు చేశాడు. అలాగే ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్ నిర్ణయాలు కూడా భారత జట్టుకే అనుకూలంగా వస్తున్నాయన్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఐసీసీ, బీసీసీఐ కలిసి టీమిండియా బౌలర్లకు ప్రత్యేకమైన బంతులు అందజేస్తున్నాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని హసన్ రాజా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దీనిని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. పాకిస్తాన్‌కే చెందిన దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం హసన్ రాజా వ్యాఖ్యలపై మండి పడ్డారు. దయచేసి మా పరువు తీయద్దంటూ హసన్ రాజాకు కౌంటరిచ్చాడు. తాజాగా పాక్ క్రికెటర్ ఛీటింగ్ ఆరోపణలపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా అతనికి గట్టిగా కౌంటరిచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఇకనైనా ఇలాంటి ఫాల్తూ, బక్వాస్ మాటలు బంద్ చేయండి. ఆటపై దృష్టి పెట్టండి’
ప్రపంచకప్ అనేది పాక్‌లో జరిగే గల్లీ టోర్నీమెంట్ అనుకున్నావా..? ఐసీసీ ఈవెంట్. మీ మాజీ క్రికెటర్ వసీం భాయ్ (వసీం అక్రమ్) చెప్పేదైనా కాస్త వినండి. కనీసం మీ ఆటగాళ్ల మీద అయినా నమ్మకం ఉంచండి’ అంటూ ఇన్ స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు షమీ. దీనికి ప్రస్తుతం ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న ‘జస్ట్ లైక్ వావ్’ వ్యాఖ్యను జోడించాడు. ప్రస్తుతం మహ్మద్ షమీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. పాక్ క్రికెటర్‌కు భలే కౌంటరిచ్చావు బాసు అంటూ టీమిండియా అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మహ్మద్ షమీ ఇన్ స్టా స్టోరీస్ పోస్ట్..
Shami hitting strongly on-field & off-field….!!!! pic.twitter.com/hpbvum2VMl
— Johns. (@CricCrazyJohns) November 8, 2023
హసన్ రాజా కామెంట్స్..
Former Pakistan cricketer Hasan Raza says the ball was changed after 25 overs and Maxwell started hitting. He believes umpires gave the same ball to Naveen & Azmat, which they give to Shami, Siraj & Bumrah! Massive statement this 🔥🔥 #CWC23 #AUSvsAFG pic.twitter.com/YyrHKWJbdb
— Farid Khan (@_FaridKhan) November 7, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..