ICC World Cup 2023: రోహిత్ శర్మను చూసి నేర్చుకో.. మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’పై షకీబుల్‌ను ఏకిపారేసిన కైఫ్
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం (నవంబర్ 6) జరిగిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అంశం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంశంపై మరోసారి తెరమీదకు వచ్చింది. తన జట్టు విజయం కోసం ఐసీసీ నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ చెబుతుండగా, మరోవైపు గెలుపు కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా అంటూ ఏంజెలో మ్యాథ్యూస్ షకీబుల్‌ను ఏకీపారేస్తున్నాడు
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం (నవంబర్ 6) జరిగిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అంశం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంశంపై మరోసారి తెరమీదకు వచ్చింది. తన జట్టు విజయం కోసం ఐసీసీ నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ చెబుతుండగా, మరోవైపు గెలుపు కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా అంటూ ఏంజెలో మ్యాథ్యూస్ షకీబుల్‌ను ఏకీపారేస్తున్నాడు. ఈ విషయంలో పలువురు క్రికెటర్లు, అభిమానులు కూడా షకీబ్ వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. తాజాగా భారతజట్టు మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. షకీబుల్ హసన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా హితవు పలికాడు. ఈ పోస్టుకు ఒక పాత ట్వీట్‌ను కూడా జోడించాడు. గతంలో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన క్రీడా స్ఫూర్తిని ఎలా చాటుకున్నాడనేది ఇందులో వివరించాడు.
వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరిగింది. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో శ్రీలంక కెప్టెన్ దసున్ శనక సెంచరీతో సత్తా చాటాడు. అయితే షనక 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు హ్మద్ షమీ అతనిని మన్కడింగ్ ఔట్ చేశాడు. కెప్టెన్ శనక కూడా పెవిలియన్ వైపు అడుగులేశాడు. అయితే ఇక్కడే కెప్టెన్ రోహిత్ శర్మ తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. షనక ఔట్ అప్పీలును వెనక్కు తీసుకున్నాడు. దీంతో బతికిపోయిన శనక.. వన్డేల్లో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ విషయంలో రోహిత్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కూడా హిట్ మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘దసున్ శనక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతటి విలువైన ఇన్నింగ్స్‌కు అలాంటి ముగింపు లభించకూడదనే అప్పీలును వెనక్కి తీసుకున్నా’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
లంక కెప్టెన్ ను వెనక్కు పిలిచిన రోహిత్..
Shakib should learn from Rohit sharma https://t.co/9TqBgdnsuP
— Mohammad Kaif (@MohammadKaif) November 7, 2023
ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్యతో పాటు టైమ్డ్ ఔట్ అయిన తొలి క్రికెటర్‌గా నిలిచిన మ్యాథ్యూస్ సైతం రోహిత్ శర్మ క్రీడాస్ఫూర్తిని ప్రశంసించారు. మహ్మద్ కైఫ్ సైతం రోహిత్ నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు. తాజాగా ఈ పాత ట్వీట్‌ను మళ్లీ రీట్వీట్ చేసిన కైఫ్.. క్రీడాస్ఫూర్తి అంటే ఏంటో రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలంటూ షకీబుల్ హసన్‌కు హితవు పలికాడు.
హిట్ మ్యాన్ ను మెచ్చుకున్న మాథ్యూస్..
Not many captains would do this but hats off to @ImRo45 for withdrawing the appeal even though the law says so! Displaying great sportsmanship 👏 pic.twitter.com/Dm2U3TAoc9
— Angelo Mathews (@Angelo69Mathews) January 10, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..