ICC World Cup 2023: ‘ఔను.. కోహ్లీ స్వార్థ పరుడే’.. విమర్శకులకు ఇచ్చిపడేసిన భారత దిగ్గజ బౌలర్
దక్షిణాఫ్రికాతో ఆదివారం (నవంబర్ 5) జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 67 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే విరాట్ చేసిన ఈ రికార్డు సెంచరీని కొందరు విమర్శిస్తున్నారు. సచిన్ రికార్డును సమం చేయడానికి విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేసాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాఫ్రికాతో ఆదివారం (నవంబర్ 5) జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 67 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే విరాట్ చేసిన ఈ రికార్డు సెంచరీని కొందరు విమర్శిస్తున్నారు. సచిన్ రికార్డును సమం చేయడానికి విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేసాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హఫీజ్ కూడా విరాట్ కోహ్లీ రికార్డుల కోసమే ఆడుతున్నాడంటూ విమర్శించాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీపై వస్తోన్న విమర్శలపై భారత మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కాస్త ఘాటుగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా విమర్శకులకు వ్యంగంగా సమాధానమిచ్చి అందరి నోళ్లు మూయించాడు. ‘ కోహ్లీ సెల్ఫిష్ అంటూ నెట్టింట వస్తోన్న స్వార్థం గురించిన సరదా కథలన్నీ విన్నాను. కోహ్లీ తన వ్యక్తిగత మైలురాళ్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడని విన్నాను. అవును.. కోహ్లీ నిజంగానే చాలా స్వార్థపరుడు. కోట్లాది మంది కలలను సాకారం చేయడంలో కోహ్లీ పూర్తిగా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నో రికార్డులు సాధించినా, ఇప్పటికే ఆటను మెరుగుపర్చుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ, కోహ్లీ నిజంగానే స్వార్థపరుడు. విజయానికి నిరంతరం కొత్త ప్రమాణాలను నిర్దేశించే స్వార్థపరుడు కోహ్లీ. జట్టు విజయాన్ని ఖాయం చేయడమే కోహ్లీకి అంత స్వార్థం. అవును కోహ్లి నిజంగానే స్వార్థపరుడు’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ప్రసాద్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసి విరాట్ అభిమానులు కూడా తెగ సంతోషపడిపోతున్నారు.
ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన కోహ్లి.. ఆస్ట్రేలియాపై 85, న్యూజిలాండ్‌పై 95, శ్రీలంకపై 88 పరుగులు చేశాడు. ఈ మూడు సందర్భాల్లో, కోహ్లి తన సెంచరీ వైపు నెమ్మదిగా బ్యాటింగ్ చేసినందుకు చాలా మంది విమర్శకులకు టార్గెట్‌గా మరాడు. అతను జట్టు ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడని కొందరు వాదించారు. నిన్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అతను 119 బంతుల్లో సెంచరీ చేయడంతో ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లి ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదనేది కూడా కొందరి వాదన. నిజానికి కోహ్లీ ప్రశాంతంగా బ్యాటింగ్ చేయడానికి ఈడెన్ గార్డెన్ పిచ్ కూడా ప్రధాన కారణం. ఎందుకంటే ఈడెన్ గార్డెన్ పిచ్ బౌలర్లకు బాగా సహకరిఇస్తుంది. బంతి పాతదయ్యే కొద్దీ పిచ్‌నెమ్మదించింది. దీంతో బ్యాటర్లకు పరుగులు చేయడం కాస్త కష్టంగా మారింది. భారత్ బ్యాటింగ్ తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడమే ఇందుకు తాజా ఉదాహరణ. ఫామ్‌లో ఉన్న ఆఫ్రికన్ బ్యాటర్లందరూ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా జట్టు మొత్తం కేవలం 83 పరుగులకే ఆలౌటైంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడం చాలా కష్టమని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్ అనంతరం చెప్పాడు.
వెంకటేష్ ప్రసాద్ ట్వీట్..
Hearing funny arguments about Virat Kohli being Selfish and obsessed with personal milestone. Yes Kohli is selfish, selfish enough to follow the dream of a billion people, selfish enough to strive for excellence even after achieving so much, selfish enough to set new benchmarks,… pic.twitter.com/l5RZRf7dNx
— Venkatesh Prasad (@venkateshprasad) November 6, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..