AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Road OTT: ఓటీటీలోకి త్రిష లేటెస్ట్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ.. ‘ది రోడ్‌’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది పొన్నియన్‌ సెల్వన్‌ వంటి భారీ హిట్‌ ను ఖాతాలో వేసుకున్న త్రిష ఇటీవలే విజయ్‌ దళపతితో కలిసి లియో సినిమాలో నటించింది. ఈ సినిమాకు ముందు ది రోడ్‌ అనే ఒక ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీలోనూ నటించింది త్రిష. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్‌. అరుణ్ వశీగరన్ తెరకెక్కించిన ది రోడ్‌ మూవీ అక్టోబర్‌ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

The Road OTT: ఓటీటీలోకి త్రిష లేటెస్ట్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ.. 'ది రోడ్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Road Movie
Basha Shek
|

Updated on: Nov 10, 2023 | 6:13 PM

Share

అందాల తార త్రిష ప్రస్తుతం ఫుల్‌ స్పీడ్‌లో ఉంటోంది. వేగంగా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది పొన్నియన్‌ సెల్వన్‌ వంటి భారీ హిట్‌ ను ఖాతాలో వేసుకున్న త్రిష ఇటీవలే విజయ్‌ దళపతితో కలిసి లియో సినిమాలో నటించింది. ఈ సినిమాకు ముందు ది రోడ్‌ అనే ఒక ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీలోనూ నటించింది త్రిష. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్‌. అరుణ్ వశీగరన్ తెరకెక్కించిన ది రోడ్‌ మూవీ అక్టోబర్‌ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సస్పె్న్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ పాజిటివ్‌ రివ్యూలను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే సాధించింది. ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ గా నటించిన త్రిషకు మంచి మార్కులు పడ్డాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ది రోడ్‌ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా త్రిష సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 10 నుంచి ది రోడ్‌ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఆహా. అయితే ప్రస్తుతానికి తమిళ్‌ భాషలోనే ది రోడ్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారు. త్వరలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ది రోడ్‌ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

ది రోడ్ సినిమా కథేంటంటే..

తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ది రోడ్ సినిమా తెరకెక్కింది. జాతీయ హైవేలోని ఒక‌ ప్రదేశంలో వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఈ హత్యల వెనక మర్మమేమిటి? దాని వెనక ఉన్నది ఎవరు అనేది తెలుసుకోవడానికి త్రిష ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో త్రిషకు ఎలాంటి అనుభవాలు ఎలాంటి ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే ది రోడ్‌ సినిమాను చూడాల్సిందే. ఈ క్రైమ్‌ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలో మాలీవుడ్‌ నటుడు షబీర్ కీ రోల్‌ పోషించాడు. ఇక త్రిష స్నేహితురాలిగా మియా జార్జ్, కానిస్టేబుల్ పాత్రలో భాస్కర్ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించారు. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన‌ ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించాడు. మరి థియేటర్లలో ది రోడ్‌ సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి..
బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి..