Naga Chaitanya: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి నాగ‌చైత‌న్య ‘ధూత’ వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

చాలా మంది స్టార్‌ హీరోల్లాగే అక్కినేని అందగాడు నాగ చైతన్య డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌తో చైతూ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ధూత అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Naga Chaitanya: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి నాగ‌చైత‌న్య 'ధూత' వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Akkineni Naga Chaitanya
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2023 | 1:12 PM

చాలా మంది స్టార్‌ హీరోల్లాగే అక్కినేని అందగాడు నాగ చైతన్య డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌తో చైతూ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ధూత అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో చైతన్యతో మనం, థ్యాంక్యూ వంటి ఫీల్‌ గుడ్‌ సినిమాలను తీసిన డైరెక్టర్‌ విక్రమ్‌ కుమారే దూత వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. గతేడాదే ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే దూతకు సంబంధించి ఎలాంటి అప్‌ డేట్స్‌ రావడం లేదు. ఈ మధ్యనే నాగచైతన్యే కూడా దూత వెబ్ సిరీస్‌ పై స్పందించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థనే ప్రకటిస్తుందని తెలిపారు. ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దూత వెబ్‌ సిరీస్‌ ను నిర్మిస్తోంది. అమెజాన్‌ రూపొందిస్తున్న మొట్ట మొదటి వెబ్‌ సిరీస్‌ ఇదే. అయితే ఎట్టకేలకు దూత వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌కు ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. డిసెంబర్‌ 1 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో దూత వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో దూత వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వస్తుందట. ఒక్కో ఎపిసోడ్‌ సుమారు 40 నిమిషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నాగ‌చైత‌న్య ఓ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ప్రముఖ నిర్మాత శరద్‌ మరార్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఈ ధూత వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్‌ రిలీజ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చైతన్య. NC 23 (వర్కింగ్ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు ఎన్‌ సీ 23 సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ధూత వెబ్ సిరీస్ లో నాగ చైతన్య..

NC 23 సినిమా కోసం మత్స్యకారులతో నాగ చైతన్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.