AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: తొమ్మిదో వారం ఓటింగ్ లో దూసుకెళుతోన్నప్రిన్స్‌ యావర్‌.. అట్టడుగున ఆ టాప్‌ కంటెస్టెంట్స్‌

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్‌ హోరాహోరీగా సాగాయి. ఈ వారం డ్రాగన్‌ స్నేక్‌ టాస్క్‌ ఇచ్చిన బిగ్‌ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్‌ ఇద్దరు పేర్లను నామినేట్‌ చేయమని సూచించారు. అలా తొమ్మిదో వార మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వచ్చారు

Bigg Boss 7 Telugu: తొమ్మిదో వారం ఓటింగ్ లో దూసుకెళుతోన్నప్రిన్స్‌ యావర్‌.. అట్టడుగున ఆ టాప్‌ కంటెస్టెంట్స్‌
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Nov 01, 2023 | 12:44 PM

Share

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్‌ హోరాహోరీగా సాగాయి. ఈ వారం డ్రాగన్‌ స్నేక్‌ టాస్క్‌ ఇచ్చిన బిగ్‌ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్‌ ఇద్దరు పేర్లను నామినేట్‌ చేయమని సూచించారు. అలా తొమ్మిదో వార మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వచ్చారు. ప్రియాంక జైన్, ప్రిన్స్‌ యావర్‌, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతికా రోజ్‌, అమర్ దీప్‌, అంబటి అర్జున్‌, భోలే షా వళి ఈ వారం నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు. ఇక తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి 10.30 గంటల నుంచి ప్రారంభం అయింది. అయితే సీజన్‌ ప్రారంభ నుంచి ఎవరి ఊహలకు అందని విధంగా ఓటింగ్‌ సాగుతోంది. ఈ వారం అనూహ్యంగా ప్రిన్స్‌ యావర్‌ అగ్రస్థానంలో దూసుకెళుతున్నాడు. ఇప్పటివరకు అతని ఒక్కడికే 20 శాతం వరకు ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో పాట బిడ్డ భోలే షా వళి ఉన్నాడు. అతనికి 18 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మూడో స్థానంలో సీరియల్‌ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌ దీప్‌ చౌదరి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 13 శాతం ఓట్లు పడ్డాయి. ఇక నాలుగో స్థానంలో ఉన్న రతికా రోజ్‌ (10.9 శాతం), 10.6 శాతం ఓట్లతో అంబటి అర్జున్‌ ఐదో ప్లేస్‌లో, 10.27 శాతం ఓటింగ్‌ తో టేస్టీ తేజా ఆరో స్థానంలో ఉన్నారు.

అయితే అనూహ్యంగా బిగ్‌ బాస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ టాప్‌ కంటెస్టెంట్లుగా పేరున్న ప్రియాంక జైన్‌, శోభా శెట్టి ఈ వారం ఓటింగ్‌లో అట్టడుగున ఉండడం గమనార్హం. ప్రియాంక జైన్‌ 7 శాతం ఓట్లతో ఏడో స్థానంలో ఉండగా, శోభా శెట్టికి మరీ దారుణంగా 4 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ప్రస్తుతానికి ప్రియాంక, శోభా శెట్టిలే డేంజర్‌ జోన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. మరీ అప్పటిలోపూ ఈ ఓటింగ్‌లో మార్పు వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ప్రిన్స్‌ యావర్‌, భోలే షా వళికి భారీగా ఓటింగ్‌ నమోదు అవుతున్నట్లు టాక్‌ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ ఓటింగ్  లేటెస్ట్ రిపోర్ట్..

నామినేషన్స్ లో ఉన్నది వీరే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు