Sania Mirza: ‘చీకటిని వెలుగుగా మార్చావ్‌’.. కుమారుడి పుట్టిన రోజున సానియా ఎమోషనల్.. ఫొటోల్లో కనిపించని షోయబ్‌

సోమవారం (అక్టోబర్‌ 30) న సానియా కుమారుడు ఇజాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఇజాన్‌ బర్త్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించింది సానియా. షోయబ్‌ మాలిక్‌ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. కుమారుడితో కలిసి ఎంతో సరదాగా కనిపించాడు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన పాక్‌ క్రికెటర్‌ 'హ్యాపీ బ‌ర్త్ డే బేటా.. బాబా నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు' అని కుమారుడిపై ప్రేమను కురిపించాడు.

Sania Mirza: 'చీకటిని వెలుగుగా మార్చావ్‌'.. కుమారుడి పుట్టిన రోజున సానియా ఎమోషనల్.. ఫొటోల్లో కనిపించని షోయబ్‌
Sania Mirza
Follow us
Basha Shek

|

Updated on: Oct 31, 2023 | 1:00 PM

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా,పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొన్నినెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వారిద్దరూ విడిపోయారని, వేరు వేరుగా జీవిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టే సానియా త‌న ముద్దుల కుమారుడు ఇజాన్ క‌లిసి దుబాయ్‌లో ఉంటుండగా, షోయబ్‌ మాలిక్‌ ఎక్కువగా పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడు. అయితే.. ఈ వార్త‌ల‌పై ఇటు సానియా మీర్జా గానీ, అటు పోయ‌బ్ మాలిక్ గానీ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే సోమవారం (అక్టోబర్‌ 30) న సానియా కుమారుడు ఇజాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఇజాన్‌ బర్త్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించింది సానియా. షోయబ్‌ మాలిక్‌ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. కుమారుడితో కలిసి ఎంతో సరదాగా కనిపించాడు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన పాక్‌ క్రికెటర్‌ ‘హ్యాపీ బ‌ర్త్ డే బేటా.. బాబా నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు’ అని కుమారుడిపై ప్రేమను కురిపించాడు. ఈ ఫొటోల్లో సానియా మీర్జా కూడా ఉంది. అయితే కుమారుడికి బర్త్‌ డే విషెస్‌ చెబుతూ సానియా మీర్జా కూడా ఇన్‌ స్టా గ్రామ్‌ లో కొన్ని ఫొటోలను పంచుకుంది. అలాగే ఒక ఎమోషనల్‌ నోట్‌ కూడా రాసుకొచ్చింది. ‘నా చుట్టూ ఎంత చీకటిగా ఉన్నా, నీ చిరునవ్వుతో అంతా వెలుగుగా మారిపోతోంది. నా జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజ‌మైన ప్రేమ అంటే ఏమిటో నువ్వు నాకు తెలియ‌జేశావు. నా హృదయంలో నీకు ఎప్ప‌టికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. . అల్లాహ్‌ నిన్ను ఎల్లవేళలా ఆశీర్వదించును గాక’ అని తన కుమారుడిపై ప్రేమకు అక్షర రూపమిచ్చింది సానియా.

ప్రస్తుతం సానియా షేర్‌ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అయితే సానియా మీర్జా షేర్‌ చేసిన ఫొటోల్లో క్కడా షోయబ్‌ మాలిక్‌ కనిపించకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010లో హైదరాబాద్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. వీరి ప్రేమ బంధానికి గుర్తింపుగా 2018లో ఇజాన్‌ అనే కుమారుడు జన్మించాడు. కాగా పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి అయేషా ఉమర్‌తో మాలిక్‌ వివాహేతర సంబంధం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. సానియాతో విడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలను అయేషా ఖండించింది. షోయబ్‌ ఒక మంచి స్నేహితుడంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

సానియా పోస్ట్..

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

షోయబ్ మాలిక్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..