Australia: నాకొద్దు బాబోయ్.. ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా నేనుండలేను: షాక్ ఇచ్చిన మాజీ ప్లేయర్..
2018లో బాల్ ట్యాంపరింగ్ ఘటన తర్వాత జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అతని కోచింగ్‌లో ఆస్ట్రేలియా ప్రదర్శన మిశ్రమంగా ఉంది. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాపై రెండుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్‌లలో కంగారూ జట్టు అద్భుతంగా గెలిచింది.

Australia Cricket Team: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden) జట్టుకు కోచ్‌గా వ్యవహరించే విషయంలో కీలక ప్రకటన చేశాడు. భవిష్యత్తులో కంగారూ జట్టుకు కోచ్‌గా అవకాశం వస్తే అస్సలు చేయనంటూ చెప్పుకొచ్చాడు. దీని వెనుక మాథ్యూ హేడెన్ పెద్ద కారణాన్ని తెలిపాడు. ఆయన ప్రకారం, జస్టిన్ లాంగర్ పరిస్థితిని చూసి, అతను ఇకపై ఆస్ట్రేలియాకు కోచ్‌గా ఉండాలనుకోలేదంటూ డిసైడ్ చేసుకున్నాడని తెలిపాడు.
2018లో బాల్ ట్యాంపరింగ్ ఘటన తర్వాత జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అతని కోచింగ్‌లో ఆస్ట్రేలియా ప్రదర్శన మిశ్రమంగా ఉంది. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాపై రెండుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్‌లలో కంగారూ జట్టు అద్భుతంగా గెలిచింది.
లాంగర్ వ్యవహారంతో..
అయినప్పటికీ, లాంగర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు. తాను కోచ్‌గా ఉండకూడదని కొందరు సీనియర్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఉన్నారని లాంగర్ ఆరోపించారు. ఇది కాకుండా దూషణలు కూడా ఎక్కువ అయ్యాయని లాంగర్ ఆరోపించారు. నా ముందు అందరూ చాలా బాగా ప్రవర్తిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడానికి నాకు ఆసక్తి లేదు – మాథ్యూ హేడెన్..
‘లాంగర్‌తో వ్యవహరించిన తీరు చూస్తుంటే, అతను ఇకపై ఆస్ట్రేలియా కోచ్‌గా ఉండాలనుకోలేదంటూ’ విజ్డెన్ క్రికెట్ మంత్లీతో మాథ్యూ హేడెన్ చెప్పుకొచ్చాడు.
నేను ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా ఉండను. జస్టిన్ లాంగర్‌తో వ్యవహరించిన విధంగా, నేను ఆస్ట్రేలియాకు కోచ్‌గా ఏ విధంగానూ ప్రయత్నించను. ఎందుకంటే నేను దానిని ఆస్వాదిస్తానని నేను అనుకోనంటూ తెలిపాడు.
View this post on Instagram
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్ , ట్రావిస్ హెడ్.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








