Onion Price: మళ్లీ భారీగా పెరుగుతున్న ఉల్లి ధర.. కారణం ఏంటంటే..

దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిపాయల రిటైల్ ధరలు 25-50 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఉల్లి కిలో రూ.50-70 వరకు విక్రయిస్తున్నారు. బుధవారం ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో నాణ్యమైన ఉల్లి అత్యధికంగా కిలో రూ.50కి చేరింది. అహ్మద్‌నగర్‌లో 10 రోజుల్లో సగటు ఉల్లి ధరలు కిలో రూ.35 నుంచి రూ.45కు పెరిగాయి. అదేవిధంగా మహారాష్ట్రలోని చాలా ఉల్లిని ఉత్పత్తి చేసే జిల్లాల్లో టోకు ఉల్లి ధరలు ఇప్పుడు కిలో రూ.45 నుండి రూ.48 వరకు ఉన్నాయి..

Onion Price: మళ్లీ భారీగా పెరుగుతున్న ఉల్లి ధర.. కారణం ఏంటంటే..
Onion
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2023 | 7:24 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు రూ.70కి చేరాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, మహారాష్ట్రలోని లాసల్‌గావ్ ఏపీఎంసీలో ఉల్లి టోకు ధర గత 15 రోజుల్లో 58 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం మహారాష్ట్రలో మొత్తం విత్తిన విస్తీర్ణం తగ్గడం. గత వారం రోజుల్లోనే ఉల్లి ధరలు 18 శాతం పెరిగాయి. మంగళవారం నాటికి లాసల్‌గావ్ మార్కెట్‌లో కిలో ఉల్లి సగటు ధర రూ.38గా ఉంది. ఇది రెండు వారాల క్రితం కిలో రూ.24తో పోలిస్తే 58 శాతం ఎక్కువ. అంతకుముందు జులై, ఆగస్టు నెలల్లో టమాటా ధర విపరీతంగా పెరిగింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు ఉల్లి మిమ్మల్ని ఏడిపించేందుకు సిద్ధమవుతోంది.

ఢిల్లీలో ఉల్లి రూ.70కి చేరింది:

దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిపాయల రిటైల్ ధరలు 25-50 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఉల్లి కిలో రూ.50-70 వరకు విక్రయిస్తున్నారు. బుధవారం ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో నాణ్యమైన ఉల్లి అత్యధికంగా కిలో రూ.50కి చేరింది. అహ్మద్‌నగర్‌లో 10 రోజుల్లో సగటు ఉల్లి ధరలు కిలో రూ.35 నుంచి రూ.45కు పెరిగాయి. అదేవిధంగా మహారాష్ట్రలోని చాలా ఉల్లిని ఉత్పత్తి చేసే జిల్లాల్లో టోకు ఉల్లి ధరలు ఇప్పుడు కిలో రూ.45 నుండి రూ.48 వరకు ఉన్నాయి.

ధరలు పెరుగుతాయని అంచనా

డిసెంబరు వరకు ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని, అలాగే ఖరీఫ్ కొత్త పంట రాకలో కూడా జాప్యం జరుగుతోందని, దాదాపు రెండు నెలల ఆలస్యంతో వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. మార్కెట్‌లో ఉల్లి రాక తగ్గడం ఉల్లి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గత పదిహేను రోజులుగా, నిల్వ ఉంచిన ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40 శాతం తగ్గాయని, రోజుకు 400 వాహనాలు (ఒక్కొక్కటి 10 టన్నులు) నుంచి 250 వాహనాలకు తగ్గాయని నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

కొత్త ఉల్లిపాయలు రెండు నెలలు ఆలస్యం

ఖరీఫ్ సీజన్ నుండి కొత్త ఎర్ర ఉల్లిపాయల రాక సుమారు రెండు నెలలు ఆలస్యమైనందున ఇదే పరిస్థితి కొనసాగుతుందని అహ్మద్‌నగర్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు నందకుమార్ షిర్కే అన్నారు. ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 25న 40 శాతం సుంకాన్ని విధించింది. అదనంగా, పెరుగుతున్న ధరలను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్‌ఏఎఫ్‌ఈడీ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిపాయలను టోకు మార్కెట్‌లలో ప్రస్తుత మార్కెట్ ధరల కంటే తక్కువకు విక్రయించడం ప్రారంభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి