Railway Ticket: ప్రయాణికులకు ఇన్‌స్టంట్ టికెటింగ్.. క్యూల కష్టాల నుంచి విముక్తి

భారతీయ ప్రయాణికులు ఇకపై పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే UTS యాప్ ద్వారా ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ఎక్కువ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. సీజన్ టిక్కెట్ పునరుద్ధరణలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కూడా చిటికెలో కొనుగోలు చేయవచ్చు..

Railway Ticket: ప్రయాణికులకు ఇన్‌స్టంట్ టికెటింగ్.. క్యూల కష్టాల నుంచి విముక్తి
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Oct 25, 2023 | 9:56 PM

పండుగల సీజన్‌లో భారతీయ ప్రయాణికులు గ్రామానికి చేరుకోవడానికి, ఇంటికి వెళ్లడానికి, తిరిగి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. పండగల సీజన్‌లో రైళ్లన్ని ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. చాలా దూరం ప్రయాణంచాల్సి ఉన్నందున తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ప్రయాణానికి ముందు రైల్వే స్టేషన్ టిక్కెట్ విండో నుండి అసలు పరీక్ష ప్రారంభమవుతుంది. చాలా మంది క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఆ తర్వాత టికెట్ డబ్బుపై వివాదం, ఇతర ఇబ్బందులు ఎన్నో అనుభవించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా రైల్వేలో చాలా అభివృద్ధి కనిపిస్తోంది. పొడవైన క్యూల నుండి ప్రయాణికులకు త్వరలో విముక్తి లభిస్తుంది. ఇందుకోసం భారతీయ రైల్వే ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని యోచిస్తోంది.

క్యూఆర్‌ కోడ్

భారతీయ ప్రయాణికులు ఇకపై పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే UTS యాప్ ద్వారా ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ఎక్కువ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. సీజన్ టిక్కెట్ పునరుద్ధరణలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కూడా చిటికెలో కొనుగోలు చేయవచ్చు.

UTS యాప్‌ను ఎలా ఉపయోగించాలి

  • యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత పేరు నమోదు చేసుకోండి
  • మొబైల్ నంబర్, పేరు, లింగం, పుట్టిన తేదీ వివరాలను పూరించండి
  • మీరు OTP ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు
  • రిజిస్ట్రేషన్ తర్వాత స్క్రీన్‌పై ఒక విండో తెరవబడుతుంది
  • దాని ఆధారంగా టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, బుకింగ్ హిస్టరీ, వాలెట్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి

టిక్కెట్ విండో వద్ద QR కోడ్

స్టేషన్‌లోని టికెట్ విండోపై క్యూఆర్ కోడ్‌లు ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణీకులు తమ UTS యాప్‌ని ఉపయోగించి ఈ QR కోడ్‌ని స్కాన్ చేయాలి. QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, ప్రయాణీకులు తమ డిజిటల్ పేమెంట్ వాలెట్ నుండి టికెట్ కోసం చెల్లించవచ్చు. అందుకే టిక్కెట్ల కోసం కిటికీల వద్ద గుంపులుగా నిలబడాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి

ప్యాసింజర్ రైళ్ల ప్రయాణికులకు పెద్ద ఊరట

ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. అలాగే పొడవాటి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. సాధారణ ప్రయాణీకులు ఈ యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. అందుకు డిజిటల్ వాలెట్ ఉపయోగిస్తే ఐదు శాతం వరకు బోనస్ కూడా అందుతుంది. GooglePay, PhonePay, Paytm లేదా ఇతర డిజిటల్ యాప్‌లను ఉపయోగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే