Acidity: కడుపులో మంట-ఎసిడిటీ ఇబ్బంది పెడుతోందా? ఈ రెండు చిట్కాలు చాలా పవర్‌ ఫుల్.. ఓసారి ట్రై చేయండి

పండగలు, పబ్బాల సమయంలో రోజూ తినేదానికంటే ఓ ప్లేట్ ఎక్కువగానే లాగించేస్తుంటారు. అయితే మీ సంతోషాలకు ఎసిడిటీ అడ్డు వస్తే కష్టమే. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం వల్లనే ఎసిడీటీ వస్తుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది వేళకు ఆహారం తీసుకోరు. మధ్యాహ్నం 12 గంటలకు బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి, రాత్రి 3:30 గంటలకు భోజనం చేస్తుంటారు. మధ్యలో ఆకలిగా అనిపిస్తే బయటి ఆహారాలను ఎక్కువగా..

Acidity: కడుపులో మంట-ఎసిడిటీ ఇబ్బంది పెడుతోందా? ఈ రెండు చిట్కాలు చాలా పవర్‌ ఫుల్.. ఓసారి ట్రై చేయండి
How To Get Rid Of Acidity
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 25, 2023 | 2:51 PM

పండగలు, పబ్బాల సమయంలో రోజూ తినేదానికంటే ఓ ప్లేట్ ఎక్కువగానే లాగించేస్తుంటారు. అయితే మీ సంతోషాలకు ఎసిడిటీ అడ్డు వస్తే కష్టమే. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం వల్లనే ఎసిడీటీ వస్తుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది వేళకు ఆహారం తీసుకోరు. మధ్యాహ్నం 12 గంటలకు బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి, రాత్రి 3:30 గంటలకు భోజనం చేస్తుంటారు. మధ్యలో ఆకలిగా అనిపిస్తే బయటి ఆహారాలను ఎక్కువగా తింటారు. దీంతో సమస్య ప్రారంభం అవుతుంది. ఈ సమస్యలు ప్రధానంగా గ్యాస్-గుండె మంటలకు కారణమవుతాయి. గ్యాస్-గుండె మంట నుంచి ఉపశమనం కలిగించే సహజ పద్ధతులను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

కలబంద రసం

గ్యాస్-గుండెల్లో మంట సంభవించినప్పుడు, నోరు త్రేనుపు ప్రారంభమవుతుంది. గ్యాస్ కారణంగా కడుపు ఉబ్బరం, ఛాతీ, గొంతు మంట సమస్య తలెత్తుతుంది. కొన్నిసార్లు ఛాతీ నొప్పి కూడా వస్తుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల పొట్ట సరిగ్గా శుభ్రం కాదు. స్ట్రీట్ ఫుడ్ వల్ల కూడా డయేరియా సమస్యలు కూడా వస్తాయి. ఈ పరిస్థితి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి కలబంద రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది. కలబందలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. కలబంద ముఖ్యంగా చర్మ సమస్యలను తగ్గించడంలో, మచ్చలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. కానీ కలబంద గట్ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిలో విటమిన్లు, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ పదార్థాలు అసిడిటీని తగ్గించి, కడుపుని ప్రశాంతంగా ఉంచుతాయి. తాజా కలబంద రసాన్ని నీటిలో కలిపి తాగితే ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కలబంద రసాన్ని రోజుకు 2-3 సార్లు త్రాగడం వల్ల గ్యాస్-గుండె మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.

మసాలా దినుసులతో ఇలా..

గుండెల్లో మంటగా అనిపించినప్పుడు తక్షణ ఉపశమనం కోసం కొన్ని సుగంధ ద్రవ్యాలు వినియోగించవచ్చు. ఇవి మీకు గ్యాస్-గుండె మంట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. ఇటువంటి ప్రయోజనకరమైన సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, అల్లం పొడి ముఖ్యమైనది. ఈ మసాలాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా జీలకర్ర గ్యాస్ సమస్యలను దూరం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక రకం మసాలా దినుసులను ఒక గ్లాసు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తర్వాత నీళ్లను చల్లబరిచి ఏ సమయంలోనైనా తాగితే ఎసిడిటీని పారదోలవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం కోసం క్లిక్‌ చేయండి.